అమ్మాయిలు జాగ్రత్త.. ఈ అబ్బాయిలు చాలా డేంజర్.. మోసం చేయడంలో వీళ్లు..

|

Mar 20, 2022 | 11:40 AM

నిజాన్ని పసిగట్టకపోవడం.. అబద్ధాన్ని అంచనా వేయలేకపోవడం జీవితంలో సర్వసాధారణం. కొందరు అబద్ధాన్ని చాలా సులువుగా

అమ్మాయిలు జాగ్రత్త.. ఈ అబ్బాయిలు చాలా డేంజర్.. మోసం చేయడంలో వీళ్లు..
Viral News
Follow us on

నిజాన్ని పసిగట్టకపోవడం.. అబద్ధాన్ని అంచనా వేయలేకపోవడం జీవితంలో సర్వసాధారణం. కొందరు అబద్ధాన్ని చాలా సులువుగా నమ్మేస్తారు.. మాటలు నేర్చిన మాటకారికి.. ఇతరులను మోసం చేయడం పెద్ద కష్టమేమి కాదని పెద్దలు అంటుంటారు.. అబద్ధం వ్యాపించినంత సులువుగా నిజం వెళ్లలేదని అంటుంటారు.. పూర్తిగా నమ్మివారు.. వారిని మోసం చేసే వరకు గుర్తించలేరట.. వారు చెప్పే మాటల వెనక ఉన్న దాగి ఉన్న విషపు ఆలోచనలు పసిగట్టలేరు.. కానీ అబ్బాయిలు అబద్ధం చెబితే కనిపెట్టడం మరింత సులభమట. అదెలాగా అంటారా.. అసలు విషయం ఏంటంటే.. అమ్మాయిలకు ఆలోచన శక్తి ఎక్కువ.. ఇతరుల ముఖ కదలికలు చూసి వారున్న పరిస్థితిని అంచనా వేయగల్గుతారు.. చాలా తెలివిగా ఆలోచిస్తారు.. తమ చుట్టు ఉండే పరిస్థితులు గురించి అవగాహనకు వస్తారు. అలాగే.. తమ జీవిత భాగస్వామి.. ప్రియుడు అబద్ధాలు చెప్తే కనిపెట్టడం కూడా సులభమే.. మీ జీవితంలో మీ భాగస్వామి లేదా ప్రియుడు మీకు చెప్పే విషయాలు అబద్ధమా.. నిజమా అనేది తెలుసుకోవడానికి ఎం చేయాలో ఇప్పుడు చూద్దాం..

రాత్రిళ్లు.. మీ భాగస్వామి అదే పనిగా ఫోన్ మాట్లాడటం.. లేదా ముఖ్యమైన పనులున్నాయంటూ బయటకు వెళ్లడం మోసానికి ప్రధాన సంకేతం. మీతో లేదా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడకపోవడం.. తరచు మీపై కోపం చూపించడం కూడా. అలాగే.. వారు మీకు తరచూ సాకులు చెప్తుంటారట.

అలాగే… ఎక్కువ సమయం వారు తమ శారీరాకృతిపై దృష్టి పెడతారు. దుస్తులు.. అలంకరణ పై ఎక్కువగా.. సమయం కేటాయిస్తారు. అలాంటప్పుడు వారు మిమ్మల్ని మోసం చేస్తున్నట్లు సూచన.. అలాగే.. మీతో ఎక్కువ సమయం కాకుండా… మీ నుంచి దూరం వెళ్లడానికి మాటలు చెబుతుంటారు..చిన్న చిన్న కారణాలను పెద్దదిగా చెప్పి మీ నుంచి దూరంగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తారు..

ప్రతి విషయంలోనూ మీతో గొడవ పడుతున్నారంటే.. మీతో ఉండడం వారికి ఇష్టం లేదనట్టు సూచన. గొడవ కోసం సాకులు వెతుక్కోవడం.. మీ సహనాన్ని పరిక్షీంచడం చేస్తుంటారు. ఇలా చేయడం వలన అతను మీతో సంబంధాన్ని ముగించాలనుకుంటున్నాడని అర్థం. మీకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ప్రయాణాలు చేయడం.. వ్యాపారం.. ఉద్యోగం దృష్ట్యా ప్రయాణాలంటూ మీ నుంచి దూరంగా వెళ్లడం కూడా మరో సూచన..

గమనిక :- పై కథనం కేవలం ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది..

Also Read: RRR-Ram Charan: మన మధ్య లేడంటే నమ్మాలని లేదు.. ఇక్కడే ఉన్నారనిపిస్తోంది.. రామ్ చరణ్ 

భావోద్వేగ కామెంట్స్.. 

Samantha: సమంత సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్.. యశోద షూటింగ్ సెట్స్‏లో..

RRR-Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్.. నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలంటూ..

Knee Pain: మోకాళ్లు.. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా ?.. అయితే ఈ ఆకులతో చెక్ పెట్టొచ్చు..