Kitchen Tips: కుక్కర్‌లో అన్నం ఉడకడానికి ఎన్ని విజిల్స్ రావాలి? ఎన్ని నీళ్లు పోయాలి?

Kitchen Tips: ప్రెషర్ కుక్కర్‌లో అన్నం చక్కగా ఉడకాలంటే సరైన మోతాదులో నీరు పోయడం చాలా ముఖ్యం. నీరు తక్కువగా ఉంటే బియ్యం మాడిపోతుంది. ఎక్కువైతే అంటుకుపోతుంది. ఎక్కువ.. తక్కువ అయినా ఇబ్బందే. అందువల్ల ప్రెషర్ కుక్కర్‌లో బియ్యం వేసేటప్పుడు కొలత..

Kitchen Tips: కుక్కర్‌లో అన్నం ఉడకడానికి ఎన్ని విజిల్స్ రావాలి? ఎన్ని నీళ్లు పోయాలి?
Kitchen Tips

Updated on: Jun 13, 2026 | 12:32 PM

Kitchen Tips: భారతీయ భోజనంలో అన్నానికి ప్రధాన స్థానం ఉంటుంది. చాలా మంది వేడివేడి అన్నాన్ని ఇష్టపడతారు. అందువల్ల భోజన సమయానికి కొద్దిసేపటి ముందు అన్నం వండటం ప్రారంభిస్తారు. కొన్నిసార్లు అన్నాన్ని త్వరగా వండాల్సిన ఒత్తిడి ఉంటుంది. అప్పుడు ప్రెషర్ కుక్కర్ ఉత్తమమైన ఆప్షన్‌. అయితే సమస్య ఏమిటంటే, మెత్తటి అన్నం వండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. వాటి గురించి చాలా మందికి తెలియదు.
చిన్న పొరపాటు లేదా సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా ప్రెషర్ కుక్కర్‌లో వండిన అన్నం మెత్తగా, జిగురుగా లేదా మాడిపోయేలా తయారవుతుంది. అందుకే మీరు ప్రెషర్ కుక్కర్‌లో మెత్తటి అన్నం వండాలనుకుంటే ఈ పద్దతులు తెలుసుకోవాల్సిందే.

బియ్యంలో ఎంత నీరు పోయాలి?

ప్రెషర్ కుక్కర్‌లో అన్నం చక్కగా ఉడకాలంటే సరైన మోతాదులో నీరు పోయడం చాలా ముఖ్యం. నీరు తక్కువగా ఉంటే బియ్యం మాడిపోతుంది. ఎక్కువైతే అంటుకుపోతుంది. ఎక్కువ.. తక్కువ అయినా ఇబ్బందే. అందువల్ల ప్రెషర్ కుక్కర్‌లో బియ్యం వేసేటప్పుడు కొలత గ్లాసు లేదా గిన్నెను ఉపయోగించండి. ఉదాహరణకు మీరు ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే ఒకటిన్నర గ్లాసుల నీరు పోయండి. రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల నీరు పోయండి. అప్పుడే బియ్యం సరిగ్గా ఉడుకుతుందంటున్నారు కుక్కర్లో వడుకునే మహిళలు.

బియ్యం ఉడకడానికి ఎన్ని విజిల్స్ రావాలి?

బియ్యం ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదు. అందుకే తరచుగా విజిల్స్ రప్పించకండి. మీరు 3 గ్లాసులు లేదా అంతకంటే ఎక్కువ బియ్యం వండుతున్నట్లయితే మంటను ఎక్కువగా ఉంచి, ఒక విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్‌ను ఆపివేయండి. అయితే, మీరు 1 లేదా 2 గ్లాసుల బియ్యం వండుతున్నట్లయితే, మంటను మధ్యస్థంగా ఉంచి, ఒకసారి విజిల్ రానివ్వండి. ప్రెషర్ పూర్తిగా విడుదలయ్యే వరకు కుక్కర్ మూత తెరవకూడదని గుర్తుంచుకోండి. దీనివల్ల బియ్యం బాగా ఉడికి, మెత్తగా వస్తుంది. రైస్ కుక్కర్‌లో బియ్యాన్ని వేయడానికి ముందు వాటిని నీటితో కేవలం రెండుసార్లు మాత్రమే కడగాలని గుర్తుంచుకోండి. తరచుగా కడగడం వల్ల బియ్యం మెత్తబడి, ముద్దగా అయ్యే ప్రమాదం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us