
చికెన్.. మటన్.. ఫిష్ అనగానే నాన్‌వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ మరి లాగించేస్తారు.. అయితే.. కోడి, మేక మాంసం (చికెన్, మటన్) విషయంలో కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.. ఎందుకంటే.. వీటిలో హై ప్రోటీన్ తోపాటు ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. చికెన్ విషయానికి వస్తే.. ఏ చికెన్ తినాలి..? బ్రాయిలరా..? నాటుకోడా.. ఒక వేళ స్కిన్ తో తింటే ఏమవుతుంది..? స్కిన్ మంచిదా..? కాదా..? అనే సందేహాలు వ్యక్తమవుతుంటాయి.. చికెన్ స్కిన్ తినడం ఆరోగ్యానికి హానికరం అనే ఒక సాధారణ అపోహ చాలా మందిలో వెంటాడుతుంటుంది. అందుకే చాలామంది చికెన్ షాపులకు వెళ్ళినప్పుడు స్కిన్ లెస్ చికెన్ ను మాత్రమే కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు. స్కిన్ తో చికెన్ తింటే ఏదో డేంజర్ ఉంటుందని వారు భావిస్తారు. అయితే, వాస్తవానికి స్కిన్ తో చికెన్ తినడం వల్ల హానికరం అన్నది కేవలం ఒక ఊహ మాత్రమేనని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం, చికెన్ స్కిన్ వాస్తవానికి ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, దీనిని పరిమిత మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ మొత్తంలో కాకుండా తక్కువ మోతాదులో చికెన్ స్కిన్ ను ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే అది శరీరానికి మేలు చేస్తుందని వారు సూచిస్తున్నారు.
చికెన్ స్కిన్ లో కొవ్వు ఉంటుందని, అది గుండెకు హాని చేస్తుందని చాలాకాలంగా ప్రచారంలో ఉంది. కానీ, కొవ్వు విషయానికి వస్తే, వాస్తవ గణాంకాలు వేరేగా ఉన్నాయి. ఒక ఔన్సు (దాదాపు 28 గ్రాములు) చికెన్ స్కిన్ లో కేవలం 8 గ్రాముల అసంతృప్త కొవ్వు, 3 గ్రాముల సంతృప్త కొవ్వు మాత్రమే ఉంటుంది. స్కిన్ చికెన్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పేర్కొన్నారు. చికెన్ స్కిన్ ను క్షుణ్ణంగా పరీక్షించిన నిపుణులు దీనిలో మోనో అన్-శాచురేటెడ్ కొవ్వు ఉన్నట్లు గుర్తించారు. ఈ రకమైన కొవ్వు మన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది హార్మోన్ల అసమతుల్యతను నివారించడంలో కూడా తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రయోజనాలు చికెన్ స్కిన్ కు ఉన్న ప్రతికూల అపోహలను తొలగిస్తాయని చెప్పవచ్చు..
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, స్కిన్ లేని చికెన్ తో పోలిస్తే, స్కిన్ ఉన్న చికెన్ ను వండుకొని తినడం మరింత మంచిది. దీనికి కారణం స్కిన్ లేని చికెన్ కు వండేటప్పుడు ఎక్కువ నూనె అవసరం అవుతుంది. చికెన్ ముక్కలు నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి. అదే స్కిన్ ఉన్న చికెన్ అయితే, అది తక్కువ నూనెను గ్రహిస్తుంది. స్కిన్ లెస్ చికెన్ వల్ల అధికంగా నూనె మన శరీరంలోకి చేరే అవకాశం ఉంది. దీనికి విరుద్ధంగా, స్కిన్ ఉన్న చికెన్ తో తక్కువ నూనె మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది.
అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చికెన్ చర్మాన్ని అతిగా తినడం మంచిది కాదు. ఒకవేళ స్కిన్ ఎక్కువ పరిమాణంలో తీసుకున్నట్లయితే అది శరీరంలో మంటకు కారణం కావచ్చు. కాబట్టి, తక్కువ మోతాదులో చికెన్ చర్మాన్ని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. అలాగే, స్కిన్ తోటి చికెన్ ను ఫ్రై చేసుకోవాలని అనుకునేవారు, చర్మం క్రిస్పీగా మారే వరకు బాగా వేయించకూడదు. అలా చేయడం వల్ల చర్మంలో ఉండే అన్ని మంచి పోషకాలు నశించిపోతాయి. కాబట్టి, మితంగా వేయించడం లేదా ఇతర ఆరోగ్యకరమైన పద్ధతుల్లో వండటం ఉత్తమం. మొత్తంగా, చికెన్ స్కిన్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దానిని సరైన పద్ధతిలో, పరిమితంగా తీసుకోవడం ద్వారానే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..