హైదరాబాద్ లో పెరుగుతున్న మధుమేహం.. క్లినిక్ ల ముందు జనం

|

Jul 18, 2019 | 12:19 PM

తెలంగాణాలో.. ముఖ్యంగా హైదరాబాద్ లో డయాబెటిస్ రోగులు పెరిగిపోతున్నారు. ఈ నగరంతో సహా మొత్తం 11 జిల్లాల్లో నాన్-కమ్యునికబుల్ డిసీజెస్ (ఎన్ సీ డీ ఎస్) సెంటర్ అధికారులు రెండు దశలుగా నిర్వహించిన సర్వే లో తేలిన నిజమిది ! డయాబెటిస్ తో బాటు హైపర్ టెన్షన్ కూడా పెరిగిందని వీరు తమ అధ్యయనంలో తెలిపారు. 11 జిల్లాల్లో 32 లక్షల మందికి గాను 2. లక్షల మంది హైపర్ టెన్షన్ తోను, 1.69 లక్షల మంది […]

హైదరాబాద్ లో పెరుగుతున్న మధుమేహం.. క్లినిక్ ల ముందు జనం
Follow us on

తెలంగాణాలో.. ముఖ్యంగా హైదరాబాద్ లో డయాబెటిస్ రోగులు పెరిగిపోతున్నారు. ఈ నగరంతో సహా మొత్తం 11 జిల్లాల్లో నాన్-కమ్యునికబుల్ డిసీజెస్ (ఎన్ సీ డీ ఎస్) సెంటర్ అధికారులు రెండు దశలుగా నిర్వహించిన సర్వే లో తేలిన నిజమిది ! డయాబెటిస్ తో బాటు హైపర్ టెన్షన్ కూడా పెరిగిందని వీరు తమ అధ్యయనంలో తెలిపారు. 11 జిల్లాల్లో 32 లక్షల మందికి గాను 2. లక్షల మంది హైపర్ టెన్షన్ తోను, 1.69 లక్షల మంది మధుమేహంతోను బాధపడుతున్నట్టు వెల్లడైంది. వీరిలో హైదరాబాద్ సహా, జనగామ, సిద్ధిపేట, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్, వరంగల్ అర్బన్, రూరల్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాలవారున్నారు. . ఈ రుగ్మతలతో బాటు ఎనీమియా, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువేనని హెల్త్ రికార్డుల ద్వారా తెలిసింది. కేవలం ఆదిలాబాద్ జిల్లాలో 16 శాతం మంది హై బీపీతోను, 6.3 శాతం మంది మధుమేహంతోను బాధపడుతున్నట్టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ద్వారా వెల్లడైంది. హైదరాబాద్ లో ప్రతి ఆరుగురిలో ఇద్దరు మధుమేహ వ్యాధిగ్రస్తులట.
సాధారణంగా శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గడం వల్ల డయాబెటిస్ సోకుతోంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ 140 ఎంజీ లు ఉండాల్సి ఉండగా.. తెలంగాణాలో ఈ రోగులకు దాదాపు 190 ఎంజీ లు ఉంటున్నాయి. తగినంత శారీరక వ్యాయామం లేకపోవడం, ఆహారపు అలవాట్లు, టెన్షన్ వంటివి ఇందుకు కారణమవుతున్నాయి. అయితే డయాబెటిస్ ను నియంత్రించే డాక్టర్లు, క్లినిక్ లు పెరగడం, ఇన్సులిన్ శాతాన్ని ఇచ్ఛే మందులు, ఇంజెక్షను వాడడం ద్వారా చాలామంది రోగులు డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోగలుగుతున్నారు. ఒక్కోసారి వాతావరణ మార్పుల వల్ల కూడా ఈ రుగ్మత సోకుతోంది. అయితే పిల్లల్లో కూడా ఇది తలెత్తడం ఆందోళన కలిగించే విషయం. జంక్ ఫుడ్స్ వంటివి ఇందుకు కారణమవుతున్నాయి. వంశ పారంపర్య రీత్యా కూడా డయాబెటిస్ సంక్రమిస్తోందని డాక్టర్లు అంటున్నారు.