ఎవరైనా తెలిసినవారు కనపడగానే ముందుగా వారిని నవ్వుతూ పలకరిస్తాం. మన చిరునవ్వే ఎదుటి వ్యక్తులు మనలో గమనించే మొదటి అంశం. అయితే చాలామంది పసుపు దంతాలతో బాధపడుతుంటారు. దీంతో నవ్వు వచ్చినా కూడా చేయి అడ్డుపెట్టుకుని నవ్వుతూ ఉంటారు. పసుపు దంతాల సమస్య కొత్తది కాదు. చాలామంది ప్రజలు ఈ సమస్యతో పోరాడుతుంటారు. అయితే ఈ సమస్య కొన్నిసార్లు ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుంది. అసలు దంతాలు ఎందుకు పసుపు రంగులోకి మారుతాయి..? వాటిని ఎలా తెల్లగా ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం….
పబ్మెడ్ సెంట్రల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఆపిల్ సైడర్ వెనిగర్ దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది. అయితే దీనిని చాలా తక్కువ పరిమాణంలో ఉపయోగించాలి.
ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయడానికి ప్రయత్నించండి. 2 నుండి 3 నిమిషాలు మాత్రమే బ్రష్ చేయడానికి కేటాయించండి. ఇలా చెయ్యడం వలన మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. నోరు, నాలుక కూడా ఎక్కవ శుభ్రంగా ఉంటాయి.
మీరు విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం… పండ్లు, కూరగాయలు తినాలి. ఇవి మీ దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడతాయి. బెర్రీలు, బీట్రూట్లను తక్కువగా తినండి ఎందుకంటే అవి దంతాల రంగును ప్రభావితం చేస్తాయి.
చాలా కంపెనీలు టూత్‌పేస్ట్‌లో యాక్టివేటెడ్ చార్కోల్ను వినియోగిస్తాయి. అది మీ దంతాలు తెల్లగా అవ్వడానికి సాయపడుతుంది. యాక్టివేటెడ్ చార్కోల్ క్యాప్సూల్స్ రూపంలో కూడా లభ్యమవుతాయి. ఈ క్యాప్యూల్స్‌ను దంతాలపై రుద్ది అనంతరం నీటితో కడగాలి.
హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడా.. ఈ రెండూ మీ దంతాలను తెల్లగా ఉంచడానికి, గారను తొలగించడానికి సాయపడతాయి. మీరు 2 టీస్పూన్లు హైడ్రోజన్ పెరాక్సైడ్, 1 టీస్పూన్ బేకింగ్ సోడాను మిక్స్ చేసి పేస్ట్ మాదిరిగా వినియోగించవచ్చు
కాల్షియం పాలలో అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది మీ దంతాలపై ఏర్పడిన పసుపు మరకలను తొలగిస్తుంది. పాలలో ఉండే ప్రోటీన్ మీ ఆరోగ్యాన్ని కూడా చక్కగా ఉంచుతుంది.
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మీ దంతాలపై ఏర్పడిన పసుపు గారను తొలగిస్తుంది. నోరు దర్వాసన రాకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది. నిమ్మరసంతో కలిపిన నీటిని ఎక్కువ మొత్తంలో ఉపయోగించడం వల్ల మీ దంతాల పసుపు రంగు తొలగిపోతుంది.
Also Read: తాగిన మైకంలో పొంగిపొర్లుతున్న వాగు మధ్యలో డ్యాన్స్… చివరికి ఏం జరిగిందో మీరే చూడండి