
ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిలో తెల్ల జుట్టు సమస్య కనిపిస్తోంది. అయితే ఇలా తెల్లగా మారిన జుట్టును మళ్లీ నల్లగా మార్చుకునేందుకు చాలా మంది మార్కెట్లో దొరికే కెమికల్స్ ఉన్న హెయిర్ డ్రైలు, శాంపూలు వాడుతుంటారు. దీని డబ్బును వేస్ట్ చేయడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తారు. కాబట్టి పార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయకుండా ఇంట్లోనే సహజంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కాబట్టి ఈ సహజ హెయిర్ డైను ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
సహజ హెయిర్ డైకు కావలసిన పదార్థాలు
ఇంట్లోనే హెయిర్ డై తయారీ విధానం:
ఈ హెయిర్ డైని ఎప్పుడూ ఇనుప బాణలిలో తయారు చేసుకుంటే ఆ ఇనుము గుణాలు కూడా తోడై మిశ్రమానికి మంచి ముదురు నలుపు రంగు వస్తుంది. ఇందుకోసం మీరు ఫస్ట్ ఇనుప బాణలిలో ఉసిరి పొడి, కాఫీ పొడి, కరివేపాకు పేస్ట్ వేయండి. ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న చిక్కటి టీ డికాషన్ పోసి, ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలిపి పేస్ట్‌లా చేసుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఇనుప బాణలిలోనే మూత పెట్టి ఒక రాత్రంతా అలాగే వదిలేయండి. మరుసటి రోజు ఉదయం చూసేసరికి ఈ మిశ్రమం పూర్తిగా నల్లటి రంగులోకి మారుతుంది. అంతే మీ హెయిర్ డై రెడీ అయినట్టే.
ఎలా ఉపయోగించాలి?
ఈ సహజ హెయిర్ డైను మీరు ఉదయాన్నే వాడవచ్చు. ఇందుకోసం మీరు తొలుత జుట్టును చిక్కులు లేకుండా బాగా దువ్వుకోండి.ఆ తర్వాత ఈ ప్యాక్‌ను జుట్టు కుదుళ్లకు, తెల్లబడిన భాగాలకు బాగా పట్టించండి. ప్యాక్ అప్లై చేసిన తర్వాత 1 నుండి 2 గంటల పాటు అలాగే ఉంచి జుట్టు పూర్తిగా ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీరు జుట్టును వాష్ చేసేప్పుడు ఎలాంటి షాంపూలను వాడకూడదు..
Note: ఇది పూర్తిగా సహజసిద్ధమైనది కాబట్టి కెమికల్ డైలాగా మొదటిసారే పూర్తిగా రంగు మారకపోవచ్చు. కానీ, వారానికి ఒకసారి చొప్పున క్రమం తప్పకుండా వాడితే జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది. అలాగే, మీకు అలర్జీ లాంటి సమస్యలు ఉంటే, వాడే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.