వార్నీ.. ఇంత సింపులా.. ఈ ట్రిక్స్ తెలిస్తే నిమిషాల్లోనే వెల్లుల్లి పొట్టు తీయొచ్చు.. కష్టపడాల్సిన అవసరమే లేదు..

వంటల్లో వెల్లుల్లి వాసన, రుచి ఎంత బాగుంటుందో.. దాని పొట్టు తీయడం అంత పెద్ద తలనొప్పిగా మారుతుంది. గోళ్లకు పొట్టు అంటుకుపోవడం, చేతుల నిండా ఘాటైన వాసన రావడం వంటి ఇబ్బందులు లేకుండా కిలోల కొద్దీ వెల్లుల్లిని నిమిషాల్లో వొలిచేయవచ్చు. వంటింట్లో మీ పనిని మరింత తేలిక చేసే అద్భుతమైన కిచెన్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం..

వార్నీ.. ఇంత సింపులా.. ఈ ట్రిక్స్ తెలిస్తే నిమిషాల్లోనే వెల్లుల్లి పొట్టు తీయొచ్చు.. కష్టపడాల్సిన అవసరమే లేదు..
How To Peel Garlic Fast

Updated on: Aug 24, 2026 | 1:07 PM

భారతీయ వంటకాల్లో వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. పోపులో వెల్లుల్లి రెబ్బలు పడితే వచ్చే సువాసన, రుచి వంటల స్థాయిని పెంచుతాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచడంలో వెల్లుల్లి ఔషధంగా పనిచేస్తుంది. అయితే వెల్లుల్లిని వాడటంలో అతిపెద్ద తలనొప్పి ఏంటంటే.. దాని పొట్టు తీయడమే. ఆ సన్నని పొట్టు చేతి గోళ్లకు అతుక్కుపోవడం, చేతులకు గాఢమైన వాసన రావడం విసుగు తెప్పిస్తుంది. అయితే కొన్ని చిన్న కిచెన్ ట్రిక్స్ పాటిస్తే గంటల తరబడి సమయం వృథా కాకుండా నిమిషాల్లో వెల్లుల్లి పొట్టును సులువుగా తొలగించవచ్చు. చాపింగ్ బోర్డుపై వెల్లుల్లి రెబ్బను ఉంచి, చాకు ఫ్లాట్ భాగంతో దానిని ఒత్తాలి. వెల్లుల్లి పూర్తిగా నలిగిపోకుండా కేవలం పై పొట్టు పగిలేలా ఒత్తితే చాలు. ఆ తర్వాత చేతితో పొట్టును చిటికెలో సులువుగా వేరు చేయవచ్చు.

డబ్బా ట్రిక్

ఎక్కువ మొత్తంలో వెల్లుల్లి పొట్టు తీయాల్సి వచ్చినప్పుడు ఈ పద్ధతి చాలా బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి రెబ్బలను విడదీసి ఓ మూత ఉన్న గట్టి డబ్బాలో వేయాలి. మూత గట్టిగా పెట్టి డబ్బాను 20 నుంచి 30 సెకన్ల పాటు బలంగా అటూ ఇటూ ఊపాలి. రెబ్బలు ఒకదానికొకటి, డబ్బా గోడలకు బలంగా తాకడం వల్ల పొట్టు దానంతట అదే విడిపోతుంది.

గోరువెచ్చని నీళ్ల ట్రిక్

వెల్లుల్లి రెబ్బలను విడదీసి సుమారు 5 నుంచి 10 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. నీటి తేమకు పై పొట్టు మెత్తబడి వదులవుతుంది. ఆ తర్వాత నీటిని వడకట్టి, రెబ్బలను చేతితో రుద్దితే పొట్టు ఇట్టే ఊడి వస్తుంది.

మైక్రోవేవ్ పద్ధతి

మీ ఇంట్లో మైక్రోవేవ్ ఓవెన్ ఉంటే వెల్లుల్లి రెబ్బలను మైక్రోవేవ్ సేఫ్ ప్లేట్‌లో పెట్టి కేవలం 10 నుంచి 15 సెకన్ల పాటు స్వల్పంగా వేడి చేయాలి. లోపలి వేడిమికి పొట్టు వదులైపోతుంది. బయటకు తీసి చేతితో నొక్కితే రెబ్బలు తేలికగా బయటకు వస్తాయి.

రెండు గిన్నెల చిట్కా

వెల్లుల్లి రెబ్బలను ఒక స్టీల్ గిన్నెలో వేసి, దానిపై మరో గిన్నెను బోర్లించాలి. రెండు గిన్నెల అంచులను గట్టిగా పట్టుకుని కొన్ని సెకన్ల పాటు బలంగా కుదపాలి. రెబ్బల మధ్య రాపిడి జరిగి పొట్టు తేలికగా ఊడిపోతుంది.

బోర్డుపై రోల్ చేయడం

వెల్లుల్లి రెబ్బను చాపింగ్ బోర్డుపై ఉంచి అరచేతి కింది భాగంతో కొద్దిగా అదిమి పట్టి ముందుకు, వెనక్కి రోల్ చేయాలి. స్వల్ప ఒత్తిడి వల్ల పైనున్న పొట్టు పగిలి వదులవుతుంది. ఆ తర్వాత వేళ్లతో పొట్టును తేలికగా లాగేయవచ్చు.

అంచులు కట్ చేయడం

చిన్న చాకు సాయంతో వెల్లుల్లి రెబ్బల రెండు వైపుల ఉండే మొనలను కట్ చేయాలి. ఆ తర్వాత చేతితో పొట్టును పట్టుకుని లాగితే ఒక్క పొర కూడా అంటుకోకుండా వెల్లుల్లి రెబ్బ పూర్తిగా బయటకు వస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us