
వెండి వస్తువులు, ఆభరణాలు గాలికి తగిలి క్రమేణా నల్లగా మారిపోతుంటాయి. వాటిని మెరిపించడానికి రసాయన క్లీనర్‌లను వాడవలసిన అవసరం లేదు. మన వంటింట్లో లభించే గోధుమ పిండితో వాటిని సులభంగా కొత్త వాటిలా మార్చవచ్చునని మీకు తెలుసా..? అంతేకాదు.. ఇది ఎటువంటి నష్టం కలగజేయని అత్యంత సురక్షితమైన, సహజమైన ఇంటి చిట్కా.
గోధుమ పిండి సహజంగానే జిడ్డును, మలినాలను పీల్చుకునే గుణం కలిగి ఉంటుంది. వెండి వస్తువులపై పేరుకుపోయిన నలుపుదనాన్ని తొలగించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
ముందుగా ఒక గిన్నెలో రెండు లేదా మూడు చెంచాల గోధుమ పిండిని తీసుకుని, అందులో తగినన్ని నీళ్లు పోసి మందపాటి పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు నల్లబడిన వెండి ఆభరణాలు లేదా నాణేలపై ఈ పిండి మిశ్రమాన్ని పూర్తిగా పట్టించాలి. పిండి పూసిన వస్తువులను కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి, పిండి పూర్తిగా ఎండిపోయే వరకు గాలిలో వదిలేయాలి. పిండి పూర్తిగా ఎండిన తర్వాత, ఒక పాత సాఫ్ట్ టూత్‌బ్రష్ సహాయంతో వస్తువులను మెల్లగా రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి, పొడి గుడ్డతో తుడిస్తే వెండి వస్తువులు సరికొత్తగా మెరుస్తాయి.
గోధుమ పిండి కాకుండా, బేకింగ్ సోడా, అల్యూమినియం ఫాయిల్ పద్ధతిని ఉపయోగించి కూడా వెండిని సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. అయితే ఈ పద్ధతుల్లో గోధుమ పిండి చిట్కా ఎటువంటి రసాయన ప్రభావం చూపదు కాబట్టి ఆభరణాలకు ఎలాంటి నష్టం వాటిల్లదు. ఈ సులభమైన ఇంటి చిట్కాతో మీ పాత వెండి వస్తువులకు మళ్లీ సరికొత్త మెరుపును తీసుకురండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..