
వంటగదిలో గ్యాస్ వెలిగించడానికి ప్రతి ఇంట్లోనూ ఉపయోగించే అతి ముఖ్యమైన పరికరం గ్యాస్ లైటర్. అయితే వంట హడావుడిలో నూనె, నెయ్యి లేదా పసుపు, మసాలాలు అంటిన చేతులతోనే దాన్ని పట్టుకుంటుంటాం. దీంతో కొద్దిరోజులకే కొత్త లైటర్ కూడా నల్లటి మొండి జిడ్డు పేరుకుపోయి, చూడటానికే వికారంగా మారుతుంది. పోనీ నీళ్లతో శుభ్రం చేద్దామా అంటే.. లోపలికి తేమ చేరితే స్పార్క్ రాక లైటర్ పూర్తిగా పనికిరాకుండా పోతుంది. దీంతో చాలామంది విసుగొచ్చి కొత్తది కొనేస్తుంటారు. కానీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చుక్క నీటిని కూడా ముట్టకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే పాత లైటర్‌ను సరికొత్తగా మెరిపించే సింపుల్ హ్యాక్స్ తెలుసుకోవడం ముఖ్యం.
లైటర్‌పై జిడ్డుతో పాటు తుప్పు, నల్లటి గట్టి పొరలు ఏర్పడితే ఈ పద్ధతి బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఒక చిన్న గిన్నెలో చెంచా బేకింగ్ సోడా తీసుకుని, అందులో కొన్ని చుక్కల వెనిగర్ లేదా నిమ్మరసం కలిపి చిక్కటి పేస్ట్‌లా చేయండి. పాత బ్రష్ సాయంతో ఆ పేస్ట్‌ను లైటర్ బయటి భాగానికి పట్టించి కాస్త రుద్దండి. కాసేపటి తర్వాత పొడి కాటన్ క్లాత్‌తో గట్టిగా తుడిచేస్తే తుప్పు, మొండి నల్లటి మరకలు క్షణాల్లో మాయమైపోతాయి.
నీటితో కడగొద్దు: లైటర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి కుళాయి కింద పెట్టడం గానీ, గిన్నెలతో పాటు నీళ్లలో ముంచడం గానీ చేయకూడదు. లోపలి స్ప్రింగ్, పీజో ఎలక్ట్రిక్ ఎలిమెంట్‌లోకి నీరు చేరితే స్పార్క్ రావడం ఆగిపోతుంది.
స్టవ్ పక్కనే పెట్టకండి: చాలామంది లైటర్‌ను గ్యాస్ స్టవ్ ప్లాట్‌ఫామ్‌పైనే పక్కన పడేస్తుంటారు. దీనివల్ల వంటల నుంచి ఎగిరిపడే నూనె తుంపర్లు, స్టవ్ మంటల వేడి నేరుగా లైటర్‌పై పడి త్వరగా పాడవుతుంది.
హోల్డర్ వాడండి: స్టవ్‌కు కాస్త దూరంగా గోడకు తగిలించే లైటర్ స్టాండ్ లేదా హోల్డర్‌లో ఉంచితే ఎక్కువ కాలం ఎలాంటి జిడ్డు లేకుండా పరిశుభ్రంగా ఉంటుంది.