
శరీరంలో చక్కెర ఎక్కువైతే అది కొన్ని సింప్టమ్స్ ద్వారా బయటపడుతుంది. దాన్ని గుర్తించడం ద్వారా మీరు షుగర్ ఇన్ టేక్ ఎక్కువ అయిందని గుర్తించొచ్చు. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుని షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకుంటూ డయాబెటిస్ రాకుండా జాగ్రత్తపడొచ్చు. శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ పెరిగితే కనిపించే సింప్టమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ పెరిగి మొటిమలు వస్తుంటాయి. అకస్మాత్తుగా మొటిమలు, విరేచనాలు లాంటివి కనిపిస్తే చక్కెర వినియోగాన్ని తగ్గించాలి. షుగర్‌తో కూడిన ఆహారం తీసుకుంటే క్యాలరీలు పెరిగి ఆకలి తగ్గుతుంది. అందుకే ఆకలి తగ్గుతున్నప్పుడు స్వీట్స్ లాంటివి ఎక్కువ తింటున్నారేమో చెక్ చేసుకోవాలి. అలాగే షుగర్ ఎక్కువగా ఉండే ఫుఢ్స్ తీసుకుంటే శరీరంలో క్యాలరీలు ఎక్కువ అవుతాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. ఉన్నట్టుండి బరువు పెరగుతుంటే దానికి చక్కెర కూడా కారణమవ్వొచ్చు. కాబట్టి షుగర్ ఇన్‌టేక్‌ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
వైట్ షుగర్.. సైటోకిన్‌లను విడుదల చేస్తుంది. అది చిరాకు, అలసటకు దారితీస్తుంది. అందుకే అలాంటి లక్షణాలు కనిపిస్తే చక్కెర ఎక్కువ తింటున్నారేమో చూసుకోవాలి. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో మెగ్నీషియం లెవల్స్ కూడా తగ్గిపోతాయి. హాయిగా నిద్రపట్టాలంటే మెగ్నీషియం మినరల్ అవసరం. అది లేనప్పుడు నిద్ర సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి స్లీప్ సైకిల్‌లో మార్పులు గమనిస్తే షుగర్ కంటెంట్ ఎక్కువైందేమో చెక్ చేసుకోవాలి. ఇకపోతే చాలామంది లావైపోతామని, షుగర్ వ్యాధి వస్తుందని.. ఇలా రకరకాల కారణాల వల్ల షుగర్‌ను పూర్తిగా అవాయిడ్ చేస్తుంటారు. కానీ శరీరానికి షుగర్ కూడా అవసరమే. అందుకే పండ్లు, పాల ఉత్పత్తుల లాంటివి తీసుకోవాలి. వాటిద్వారా శరీరానికి సహజ చక్కెరలు అందుతాయి. వీటితో ఎలాంటి నష్టం ఉండదు.
నోట్: ఇందులో అందించిన సమాచారం, పరిష్కారాలు కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మేము వాటిని నిర్ధారించడం లేదు. వాటిని అనుసరించే ముందు దయచేసి ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.