
చాలా మంది చలి కాలంలో వేడి నీటిని వాడుతారు. ఒక అధ్యయనం ప్రకారం, ఒక గంట పాటు మధ్యస్తంగా వేడి నీటిలో స్నానం చేస్తే, 30 నిమిషాలు నడిచినప్పుడు కరిగే కేలరీలు కరుగుతాయి. ఒక గంట స్నానం వలన 140 కేలరీలు కరుగుతాయి అని వెల్లడైంది. వేడి నీటిలో స్నానం చేసినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం వలన కేలరీలు త్వరగా కరుగుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఈ అలవాటు మంచి మార్పు ఇస్తుంది. దీని వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి..
రోజువారీ వేడి నీటి స్నానం కేవలం శరీరాన్ని శుభ్రపరచడమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఇది బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది: వేడి నీటి స్నానం వలన శరీరం విశ్రాంతి పొంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను సాధారణీకరించడానికి, గుండె ఆగిపోయే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
నొప్పులకు ఉపశమనం: గోరువెచ్చని నీటిలో స్నానం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థకు సడలింపు ఇస్తుంది. కండరాల నొప్పితో సహా అన్ని రకాల శరీర నొప్పులు తగ్గుతాయి. స్నానం చేసేటప్పుడు చేతులు, కాళ్లు సాగదీయడం వలన కీళ్లు, ఎముకల నొప్పి తగ్గుతుంది.
రక్తపోటు, నిద్ర: కోపంగా ఉన్నా, అధిక రక్తపోటు ఉన్నా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం. ఇది రక్తపోటును తగ్గించి, మనసుకు విశ్రాంతి ఇస్తుంది. మెదడుతో సహా శరీర అవయవాలు విశ్రాంతి పొంది, మంచి నిద్రకు దారితీస్తుంది.
దీర్ఘకాలిక సమస్యలు: దీర్ఘకాలిక వ్యాధులు, ఒత్తిడితో బాధపడేవారు గోరువెచ్చని నీటి స్నానం వలన ఉపశమనం పొందుతారు. ఇది దీర్ఘకాలిక నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
గమనిక: ఈ కథనంలో తెలిపిన ఆరోగ్య సమాచారం, అధ్యయనాలు సాధారణ అవగాహన కోసం మాత్రమే. గుండె సమస్యలు ఉన్నవారు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వేడి నీటి స్నానం వంటి దినచర్యలో మార్పులు చేసే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.