కొవ్వు కరిగించడానికి మందులు వాడుతున్నారా..! ఈ విషయం తెలిస్తే వెంటనే మానేస్తారు..

|

Nov 30, 2021 | 9:32 PM

Health Tips: ఆధునిక కాలంలో అధిక కొలెస్ట్రాల్‌తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ కొవ్వు శరీరంలో కాలేయం చుట్టూ పేరుకుపోతుంది. మనం అధిక చెడు కొవ్వుని కలిగి

కొవ్వు కరిగించడానికి మందులు వాడుతున్నారా..! ఈ విషయం తెలిస్తే వెంటనే మానేస్తారు..
Bad Cholesterol
Follow us on

Health Tips: ఆధునిక కాలంలో అధిక కొలెస్ట్రాల్‌తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ కొవ్వు శరీరంలో కాలేయం చుట్టూ పేరుకుపోతుంది. మనం అధిక చెడు కొవ్వుని కలిగి ఉంటే చాలా ఆరోగ్య సమస్యలని ఎదురుకోవాల్సి ఉంటుంది. కొంతమంది కొవ్వు కరిగించడానికి మందులు కూడా వాడుతారు. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. దీనికన్నా ఇంట్లోనే కొవ్వు కరిగించే రెమిడీస్‌ ఉన్నాయి. ప్రతిరోజు ఈ చిట్కాలను పాటిస్తే కొవ్వు కరిగించవచ్చు. అంతేకాక ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు. ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.

ధనియాలు
1. ముందుగా ఒక కప్పు నీరు తీసుకుని అందులో రెండు చెంచాల ధనియాల పొడి వేయాలి.
2. ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద 10 నిమిషాలు మరగనివ్వాలి.
3. తర్వాత మిశ్రమాన్ని ఫిల్టర్ చేయాలి.
4. ఈ విధంగా ఫిల్టర్ చేసిన నీటిని రోజుకు రెండు మూడు సార్లు తాగాలి. రోజూ టీకి బదులుగా ఈ వాటర్‌ తాగవచ్చు. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఉల్లిపాయ
కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉల్లిపాయలు కూడా సహాయపడతాయి. బార్సిలోనా విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉల్లిపాయ రసం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
1. ముందుగా పెద్ద ఉల్లిపాయను తరిగి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
2. ఇప్పుడు ఆ ఉల్లిపాయ రసాన్ని తీయాలి.
3. ఉల్లిపాయ రసాన్ని జల్లెడ లేదా సన్నని గుడ్డతో ఫిల్టర్ చేయడం ద్వారా తీయవచ్చు.
4. రెండు టీస్పూన్ల ఉల్లిపాయ రసంలో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి తాగాలి.
5. రోజుకు కనీసం రెండు సార్లు ఇలా చేయాలి. చెడు కొలెస్ట్రాల్ ఒక నెలలో తగ్గుతుంది.
6. కొత్తిమీర, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి భారతీయ సంప్రదాయ ఆహారంలో భాగం. వీటిని ఉపయోగించి అధిక కొలెస్ట్రాల్ సమస్య పరిష్కరించుకోవచ్చు.

10 మ్యాచ్‌లో 43 వికెట్లు తీసిన ఈ బౌలర్‌ టీమిండియాకి సవాల్‌ విసిరాడు..! ఏ విషయంలో తెలుసా..?

Gudumba Base: నది మధ్యలో గుడుంబా స్థావరం.. వీరి తెలివి చూస్తే షాక్ అవుతారు..

పెంపుడు జంతువులు కరిస్తే అజాగ్రత్తగా ఉండకండి.. చాలా ప్రమాదం ఈ విషయాలు తెలుసుకోండి..