Helicopter Rental: అద్దెకు హెలికాప్టర్.. ధర ఎంత? ఎలా బుక్ చేసుకోవాలి?

|

Mar 14, 2024 | 8:23 AM

చాలా మందికి సొంత హెలికాప్టర్లు కూడా ఉంటాయి. అయితే ఎక్కువ మంది వీటిని అద్దెకు తీసుకొని వినియోగిస్తుంటారు. కొన్ని ప్రైవేటు కంపెనీలు కూడా ఈ హెలికాప్టర్లను అద్దెకిస్తుంటాయి. ఒకవేళ హెలికాప్టర్ ను అద్దెకు తీసుకోవాలంటే ఎలా? ఎవరిని సంప్రదించాలి? దానికయ్యే ఖర్చు ఎంత?వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Helicopter Rental: అద్దెకు హెలికాప్టర్.. ధర ఎంత? ఎలా బుక్ చేసుకోవాలి?
Helicopter Rental
Follow us on

హెలికాప్టర్ వినియోగం అనేది సాధారణమైన విషయం కాదు. దానిని అందరూ వినియోగించలేరు. పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు, సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాధినేతలు మాత్రమే ఎక్కువగా వినియోగిస్తుంటారు. చాలా మందికి సొంత హెలికాప్టర్లు కూడా ఉంటాయి. అయితే ఎక్కువ మంది వీటిని అద్దెకు తీసుకొని వినియోగిస్తుంటారు. కొన్ని ప్రైవేటు కంపెనీలు కూడా ఈ హెలికాప్టర్లను అద్దెకిస్తుంటాయి. ఒకవేళ హెలికాప్టర్ ను అద్దెకు తీసుకోవాలంటే ఎలా? ఎవరిని సంప్రదించాలి? దానికయ్యే ఖర్చు ఎంత?వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

అక్కడి నుంచి ఎక్కువగా..

హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవడం భారతదేశంలో కొత్త విషయం కాదు. నిజానికి, ఇది అనేక అంశాలలో కీలక పాత్ర పోషిస్తుంది. చాలా సంవత్సరాలుగా, భక్తులు దూరం ప్రయాణించి, ఆయా పవిత్ర స్థలాల్లో నివాళులు అర్పించేందుకు, అమర్‌నాథ్, వైష్ణో దేవి వంటి వివిధ మతపరమైన ధామ్‌ల ప్రారంభ స్థానాల నుంచి పలు ఏజెన్సీలు చాపర్‌లను నడుపుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ దూరాలను కవర్ చేయాలి అనుకునే వారికి హెలికాప్టర్ ను అద్దెకు తీసుకోవడానికి ఎక్కువగా మొగ్గుచూపుతారు. హెలిప్యాడ్ కోసం పెద్ద ఖాళీ స్థలం ఉంటే చాలా చాపర్ ను ల్యాండింగ్ చేయడం సులభం అవుతుంది.

కోవిడ్ తర్వాత నుంచి డిమాండ్..

మీరు తక్కువ వ్యవధిలో ఎక్కువ దూరాలను అధిగమించాల్సిన అవసరం వచ్చినప్పుడు చార్టర్ హెలికాప్టర్లు ఉపయోగపడతాయి. తీర్థయాత్రలకు దూరాలను కవర్ చేయడానికి, నగరాల మధ్య రాకపోకలు చేయడానికి, వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణీకులను/వైద్యులను/రోగులను దూరప్రాంతాలకు తరలించడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అవార్డ్ షోలు, వెడ్డింగ్ ఎంట్రీలు, మరెన్నో ఈవెంట్‌లకు కూడా ఇవి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి అద్దెకు చాపర్ తీసుకునే ట్రెండ్ కోవిడ్ అనంతర బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎక్కువ దూరాలు ప్రయాణించే వారు రైళ్లు, ఫ్లైట్లలో జనాలతో కలిసి ప్రయాణం చేయడానికి భయపడే.. ఆర్థికంగా బలంగా ఉన్న వారు ఈ చాపర్ల బాట పట్టారు.

హెలికాప్టర్‌ను ఎలా అద్దెకు తీసుకోవాలి..

హెలికాప్టర్‌ను బుక్ చేసుకోవడం చాలా సులభం. అందుకోసం ప్రత్యేకంగా కొన్ని ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. వారి వెబ్‌సైట్‌లకు లాగిన్ చేసి, మీ గమ్యస్థానంలో ఏవైనా ఛాపర్‌లు అందుబాటులో ఉన్నాయో లేదో చూసి బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ ఫార్మాలిటీలను (వ్యక్తుల సంఖ్య, వ్యక్తిగత లేదా సమూహ బుకింగ్‌లు) పూర్తి చేసి, అవసరమైన అన్ని డాక్యుమెంటేషన్‌లు సమర్పిస్తే చాలు.

ఖర్చు ఎంతవుతుందంటే..

ఒక రోజంతా హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటే ఒక రౌండ్ ట్రిప్ కోసం రూ. 2.6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కొన్ని కంపెనీలు ఇంటర్-సిటీ బదిలీల కోసం ప్రైవేట్ చాపర్‌లలో సీటును రూ. 12,000 కంటే తక్కువ ధరకు అందిస్తాయి. అయితే మతపరమైన ప్రదేశాలలో ఉన్న వాటి ధర మరింత తక్కువగా ఉంటుంది.

హెలికాప్టర్‌ను ఎక్కడ బుక్ చేసుకోవచ్చు?

ఎయిర్ చార్టర్స్ ఇండియా, బ్లేడ్, ఫ్లయింగ్ చార్టర్స్, కంఫర్ట్ మై ట్రావెల్, బద్రి హెలికాప్టర్లు, అక్రిషన్ ఏవియేషన్, ఏఓ హెలికాప్టర్లు, బ్లూహైట్స్ ఏవియేషన్, ఎయిర్ చార్టర్ సర్వీస్

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..