Herbal Tea: వర్షాకాలంలో రోజుని హెర్బల్ టీతో ప్రారంభించండి.. సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం..

శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ డైటీషియన్ ప్రియా పలివాల్ మాట్లాడుతూ.. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు ఈ సీజన్‌లో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధుల బారిన త్వరగా పడతారు. వర్షాకాలంలో వ్యాధులు రాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని కోసం హెర్బల్ టీ తాగవచ్చు. ఏ హెర్బల్ టీలు ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

Herbal Tea: వర్షాకాలంలో రోజుని హెర్బల్ టీతో ప్రారంభించండి.. సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం..
Monsoon Season Herbal TeaImage Credit source: freepik
Follow us

|

Updated on: Jul 04, 2024 | 10:21 AM

వర్షాకాలం వస్తూ వేడి నుంచి ఉపశమనం మాత్రమే కాదు.. అనేక ఆరోగ్య సవాళ్లను తెస్తుంది. అయితే వర్షాల వల్ల ఈ సీజన్‌లో వేడి నుంచి ఉపశమనం లభించినా ఈ కాలంలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ పెరిగి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మండే ఎండల నుంచి రక్షణ పొందే ఈ సీజన్‌లో ఇన్‌ఫెక్షన్లు రాకుండా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంపై శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ డైటీషియన్ ప్రియా పలివాల్ మాట్లాడుతూ.. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు ఈ సీజన్‌లో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధుల బారిన త్వరగా పడతారు. వర్షాకాలంలో వ్యాధులు రాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని కోసం హెర్బల్ టీ తాగవచ్చు. ఏ హెర్బల్ టీలు ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

పుదీనా టీ:

వర్షాకాలంలో పుదీనా టీ తాగడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టీ తాజాదనాన్ని అందించడమే కాదు అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెరుగుతుంది. పుదీనా టీ శ్వాసను ఫ్రెష్ గా ఉంచుతుంది.

అల్లం టీ

అల్లం టీ చాలా మంది ప్రజల మొదటి ఎంపిక. కొంతమంది ఈ టీతో ఉదయం ప్రారంభిస్తారు. ఔషధ గుణాలతో నిండిన ఈ టీని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడటంతో పాటు అలర్జీలు కూడా దూరమవుతాయి.

ఇవి కూడా చదవండి

చామంతి టీ

వర్షాకాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చామంతి టీ తాగడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని దూరం చేయడంతో పాటు మంచి నిద్ర పొందడంలో కూడా సహాయపడుతుంది. దీనితో పాటు జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది.

గ్రీన్ టీ

సాధారణంగా బరువు తగ్గడానికి గ్రీన్ టీ తాగుతారు. అయితే యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఈ టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది మన శరీరాన్ని కూడా డిటాక్సిఫై చేస్తుంది. ఇది వ్యాధులతో సమర్థవంతంగా పోరాడడంలో సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏమైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)