పాముల దేశం అని దేనిని పిలుస్తారో తెలుసా..?

TV9 Telugu

06 July 2024

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 రకాల పాములు నివసిస్తున్నాయని జీవశాస్త్ర శాస్త్రవేత్తల నివేదికలు చెబుతున్నాయి.

పామును ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన జంతువుగా పరిగణిస్తారు. చాల పాముల్లో విషం ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా పాములు చాలా ప్రమాదకరమైనవి, ఇవి కానీ కాటు వేస్తే మానవులు వెంటనే మరణిస్తారు.

ప్రపంచంలోని చాలా పాములు స్నేక్ ఐలాండ్‌లో కనిపిస్తాయని జీవశాస్త్ర పరిశోధకులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ స్నేక్ ఐలాండ్ బ్రెజిల్‌ దేశంలో ఉంది. ఇల్హా డా క్యూయిమాడ అని కూడా చాలామంది ప్రజలు ఈ ఐలాండ్ ని పిలుస్తారు.

ఈ పాముల ద్వీపంలో వివిధ జాతులకు చెందిన 4,000 కంటే ఎక్కువ పాములు నివసిస్తున్నాయని పరిశోధనలో వెల్లడైంది.

ఈ ప్రాంతం ప్రమాదకరం కావడంతో, దీంతో పటు పాములకు హాని కలిగిస్తారని సామాన్య ప్రజలు ఇక్కడికి వెళ్లేందుకు అనుమతి లేదు.

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము కూడా ఇల్హా డా క్యూయిమాడ అనే ఈ స్నేక్ ఐలాండ్‌లోనే ఉందని చెబుతున్నారు.