ప్రపంచంలోనే సేఫ్ ఫ్లేస్.. వాల్ట్ ఆఫ్ డూమ్ ఎక్కడ ఉంది?
TV9 Telugu
06 July 2024
వాల్ట్ ఆఫ్ డూమ్‌ను ఈ భూమి మీద అత్యంత సురక్షితమైన సేఫ్ అని అంటారు. ఎందుకో ఈరోజు తెలుసుకుందాం రండి..
నార్వే దేశంలో ఉన్న స్వాల్బార్డ్ ద్వీపసమూహంలో ఇది ఉంది. అందులో స్పిట్స్‌బెర్గెన్ అనే ద్వీపం ఒకటి ఉంది.
ఈ ద్వీపం ఉత్తర ధ్రువానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ భద్రపరిచిన ఖజానా పేరు స్వాల్‌బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్.
ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ భారీ సేఫ్ లోపల ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో పండే పంటల విత్తనాలు దాచుతారు.
ఈ సేఫ్ 2008లో పూర్తయింది. ఈ వాల్ట్‌లో 12 లక్షలకు పైగా విత్తనాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక్కో రకానికి చెందిన 500 విత్తనాలు ఉన్నాయి.
ఇది కాకుండా, ఈ వాల్ట్‌లో 250 కోట్ల విత్తనాలను నిల్వ చేయడానికి స్థలం ఉంది. ఏదైన ప్రళయం సంభవించిన తర్వాత వాడతారని చెబుతారు.
భవిష్యత్తులో ఏదైనా విపత్తు వల్ల భూమి మొత్తం మీద పంటలు అన్ని నాశనమై తిండి, పానీయాల సమస్య తలెత్తుతుంది.
ఈ ఖజానా నుండి తీసిన విత్తనాల ద్వారా మళ్లీ పంటలు పండించవచ్చు. అందుకే దీన్ని వాల్ట్ ఆఫ్ డూమ్ అని కూడా అంటారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి