Health Tips: ఉదయాన్నే ఈ పనులు చేసే అలవాటు ఉందా? వెంటనే వదిలేయండి.. కాదంటే కష్టాలు తప్పవు మరి..

ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన జీవనశైలి, సమయం పాలన లేని తిండి కారణంగా చాలామంది శరీర బరువు పెరుగుతుంది. ముఖ్యంగా ఉదయాన్నే చేసే కొన్ని పనులు..

Health Tips: ఉదయాన్నే ఈ పనులు చేసే అలవాటు ఉందా? వెంటనే వదిలేయండి.. కాదంటే కష్టాలు తప్పవు మరి..
Morning Bad Habits

Updated on: Nov 29, 2022 | 9:38 PM

ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన జీవనశైలి, సమయం పాలన లేని తిండి కారణంగా చాలామంది శరీర బరువు పెరుగుతుంది. ముఖ్యంగా ఉదయాన్నే చేసే కొన్ని పనులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. చాలా మంది అనారోగ్యకరమైన ఆహారం తినడం, దురలవాట్లతో రోజును ప్రారంభిస్తారు. ఇది వారి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. శరీర బరువు విపరీతంగా పెరుగుతుంది. అయితే, ఉదయాన్నే కొన్ని తప్పులు చేయకుండా ఉండటం వల్ల ఆరోగ్యకరమైన బరువు నిర్వహించడంతో పాటు.. రోజంతా ఉత్సాహంగా ఉండటంలో సహాయపడుతుంది. ఉదయాన్నే చేయకూడని ఆ దరులవాలట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆలస్యంగా మేల్కోవడం..

తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. అయితే, చాలా మంది అవసరానికి మించి నిద్రపోతుంటారు. ఇది బరువు పెరగడానికి దారి తీస్తుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోతే.. మరుసటి రోజు ఉదయం ఆలస్యంగా లేవాల్సి వస్తుంది. ఫలితంగా అల్పాహారం కూడా ఆలస్యంగా మారుతుంది. ఇది జీవక్రియపై చెడు ప్రభావం చూపుతుంది. దీని కారణంగా జీవక్రియ నిమ్మదించి.. ఊబకాయం సమస్య తలెత్తుతుంది.

నీళ్లు తాగకపోవడం..

ఉదయాన్నే నిద్రలేచిన తరువాత నీళ్లు తాగాలని పెద్దలు, వైద్యులు సూచిస్తుంటారు. ఉదయాన్నే నీళ్లు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. దీని కారణంగా జీవక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా శరీరం తక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. అదికాస్తా ఊబకాయం సమస్యకు దారి తీస్తుంది. ఉదయం పూట నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. అందుకే ఉదయం నిద్రలేవగానే నీళ్లు తాగాలి.

ఇవి కూడా చదవండి

బ్రేక్‌ఫాస్ట్‌‌లో హానీకరమైన ఫుడ్ తీసుకోవడం..

చాలామంది ఉదయాన్నే అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటారు. ఎక్కువ ఉప్పు, కొవ్వు పదార్థాలు తినడం వల్ల బరువు పెరుగుతాయి. దీనికి బదులుగా ఉదయాన్నే ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

టీవీ చూస్తూ భోజనం చేయొద్దు..

చాలా మంది ఉదయాన్నే టీవీ చూస్తూ టిఫిన్ చేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి హానీకరం. టీవీ చూస్తూ తినడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకుంటారు. అదికాస్తా అధిక బరువుకు దారి తీస్తుంది. అందుకే భోజనం చేసేటప్పుడు టీవీ చూడొద్దు. ఆహారాన్ని నెమ్మదిగా తింటూ బాగా నమిలి మింగాలి.

టీ లో ఎక్కువ చక్కెర..

చాలా మంది ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది. అందులో చక్కెర ఎక్కువగా వేసుకుంటారు. కాఫీ, టీ లలో చక్కెర ఎక్కువగా వేసుకుంటే బరువు పెరుగుతారు. అలా చేయకుండా ఉండాలి.

ఆరోగ్యంగా ఉండాలంటే ఇది తప్పనిసరి..

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ ఉదయం వ్యాయామం చేయడం తప్పనిసరి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది కొవ్వును కరిగిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రోజూ ఉదయం ఒక అరగంట పాటు వ్యాయామం చేయడం వలన మంచి జరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us