రోటీ-అన్నం కలిపి తింటున్నారా..? అయితే, మీరు కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే..

మన భారతీయ ఆహారంలో ఎక్కువ మంది తీసుకునే ఆహారం రోటీ, అన్నం ఉంటాయి. కొందరు అన్నం ఎక్కువగా తింటారు. మరికొందరు రోటీ తింటారు. ఇంకొందరు రోటీ అన్నం కలిపి తింటూ ఉంటారు. ఇటీవల ఈ రెండింటినీ ఒకేసారి తినడం అలవాటుగా మారింది. అయితే, రోటీతో పాటు అన్నం తినడం మంచిదేనా అనే సందేహం చాలా మంది వ్యక్తం చేస్తుంటారు. నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

రోటీ-అన్నం కలిపి తింటున్నారా..? అయితే, మీరు కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే..
Bread And Rice

Updated on: Nov 30, 2025 | 9:22 PM

చాలా మంది అన్నం రోటీ కలిపి తింటూ ఉంటారు. కానీ, ఇలా తినటం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రోటీ, అన్నం రెండూ వేర్వేరు పోషక లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని కలిపి తినరాదని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక సమయంలో రోటీ లేదా అన్నం ఏదో ఒకటి మాత్రమే తినాలని చెబుతున్నారు. రెండూ కలిపి తింటే ప్రేగులలో కిణ్వ ప్రక్రియ జరుగుతుంది, గ్లైసెమిక్ సూచిక కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

రోటీ, బియ్యం రెండూ కార్బోహైడ్రేట్లకు మంచి వనరులుగా ఉంటాయి. అలాంటప్పుడు రొట్టె, అన్నం రెండూ శరీరానికి శక్తిని అందిస్తాయని ప్రజలు నమ్ముతారు. కానీ, రోటీ, అన్నం మిశ్రమం బరువుగా ఉంటుంది. ఇది మీ జీర్ణశక్తిని బలహీనపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మీ పొట్టలో గ్యాస్, అసౌకర్యం, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చునని చెబుతున్నారు. రోటీ, అన్నం కలిపి తింటే లావు పెరిగే అవకాశం ఉంది.

అంతేకాదు..డయాబెటిస్ బాధితులకు ఇది మరింత అనారోగ్యం. అన్నం, రోటి కలిపి తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కనుక ఈ రెండింటినీ కలిపి తినకూడదని చెబతున్నారు. రోటీ, అన్నం ఒకేపూట తినడం వల్ల చక్కెర స్థాయిలలో హెచ్చు తగ్గులు వస్తాయి. రోటీ, అన్నంలో కేలరీల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకేసారి అన్నంతో పాటు రోటీ తినడం ద్వారా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఒకేపూట వీటిని తినకపోవడం బెటర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..