అంజీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా మనం అంజీర్‌ను పండుగా లేదా డ్రై ఫూట్‌గా తీసుకుంటాం. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు అంజీర్‌తో చెక్ పెట్టొచ్చు. అయితే అంజీర్ కేవలం డ్రైఫ్రూట్‌గానే కాకుండా అంజీర్ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పోషకాలు పుష్కలంగా ఉండే అంజీర్‌ను జ్యూస్ రూపంలో తీసుకుంటే మరెన్నో లాభాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అంజీర్ జ్యూస్ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎన్నో కడుపు సంబంధిత సమస్యల నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా అజీర్తి సమస్యకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి పీచు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా అంజీర్ బాగా ఉపయోగపడుతుంది. అంజీర్ రసంలో ఉండే ఫినోలిక్ యాసిడ్ శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. గొంతులో సమస్యలు, కఫం వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా అంజీర్ జ్యూస్ ఉపయోగపడుతుంది. ఇక నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ప్రతీ రోజూ రాత్రి అంజీర్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే అంజీర్ జ్యూస్ ఇందోళన, మైగ్రేన్, నిద్రలేమి వంటి సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది.
ఇక ఈ జ్యూస్‌లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని దూరం చేయడంతో పాటు బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది. సాయంత్రం స్నాక్స్‌కు బదులుగా ఈ జ్యూస్ తాగితే బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీల్లో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడేవారికి కూడా అంజీర్ జ్యూస్ ఉపయోగపడుతుంది. వీటిలోని యాంటీ-యూరోలిథియాటిక్ రాళ్ల సమస్యను దూరం చేస్తాయి. భవిష్యత్తులో కూడా రాళ్లు ఏర్పడకుండా చూస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..