Pomegranate Leaves: దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..

దానిమ్మ మంచి రుచికరమైన పండ్లను అందించే ఔషధ మొక్క. కేవలం దానిమ్మ పండ్లు మాత్రమే కాదు.. ఈ చెట్టు ఆకులు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయని తెలిస్తే మీరు నమ్మలేరు. దానిమ్మ మొక్కలోని ప్రతి భాగాన్ని ఔషధంగా ఉపయోగించవచ్చు. దానిమ్మ ఆకుల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు నిండివున్నాయి. ఎన్నో జబ్బులను నయం చేసే గుణం ఉంటుంది. దానిమ్మ చెట్టు ఆకుల ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..

Pomegranate Leaves: దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..
Pomegranate Leaves

Updated on: Dec 18, 2025 | 9:32 PM

ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులను అనేక సాధారణ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. దానిమ్మ ఆకులతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. కామెర్లు, విరేచనాలు, కడుపు నొప్పి, నిద్రలేమి వంటి సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ ఆకులతో చేసిన కషాయం శరీరంలో కొవ్వు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

దానిమ్మ ఆకులలో ఉండే ప్రయోజనకరమైన యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు నోటిలో ఉండే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. అటువంటి పరిస్థితిలో, మీరు నోటి పూతల చికిత్సకు దానిమ్మ ఆకుల రసాన్ని కూడా ఉపయోగించవచ్చు. అంతేకాదు దానిమ్మ ఆకులు నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. ఈ ఆకులను ఉదయం పరగడుపున మరిగించి తీసుకోవాలి.. లేకపోతే ఈ నీటిని పడుకునే ముందు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యకు చక్కని పరిష్కారం.

ఇవి కూడా చదవండి

దానిమ్మ ఆకులను నీటిలో మరిగించి తీసుకోవటం వల్ల ప్రభావంతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇది దగ్గు, జలుబుకి మంచి రెమిడీగా పనిచేస్తుంది. ఈ నీటిని రోజుకు రెండుసార్లు తాగటం వల్ల ఇది దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీ గొంతులోని ఇన్ఫెక్షన్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే, దానిమ్మపండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. విటమిన్ సి కూడా ఉంటుంది.

దానిమ్మ ఆకుల ఆరోగ్య పరంగా మాత్రమే కాదు.. చర్మ సౌందర్య ప్రకారం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ముఖంపై మచ్చలు వాటి తాలూకు ఆనవాళ్లు ఉంటే దానిమ్మ ఆకులను దంచి పేస్టును ముఖానికి అప్లై చేయాలి. ఇది కంటి భాగంలో అప్లై చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి వెంటనే మచ్చలు తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us