Triphala Drink: త్రిఫల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం.. ఈ సమస్యలు దూరం!

త్రిఫల.. ఆయుర్వేదంలో ఆరోగ్యానికి ఇది ప్రభావవంతమైన దివ్యౌషధం. దీంతో శరీరంలోని అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పూర్వకాలం నుంచి త్రిఫలను అనేక రోగాలకు ఔషధంగా వాడుతున్నారు. కానీ, త్రిఫల సహాయంతో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు..మీ బరువును సహజంగా తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదేలాగో పూర్తి వివరాల్లోకి వెళితే..

Triphala Drink: త్రిఫల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం.. ఈ సమస్యలు దూరం!
Triphala Drink

Updated on: Jan 22, 2025 | 7:42 PM

మూడు రకాల ఔషధాలు ఇందులో ఉండటం వల్ల దీనికి త్రిఫల అనే పేరు వచ్చింది. ఉసిరి, కరక్కాయ, తానికాయ ఇందులో ఉంటాయి. ఈ మూడింటి మిశ్రమంతో త్రిఫల తయారుచేస్తారు. దీనిని తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా త్రిఫల ఫ్యాట్ బర్నర్ డ్రింక్ తాగడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. అటువంటి పరిస్థితిలో మలబద్ధకం వంటి సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. అంతేకాదు.. త్రిఫలను ఆహారంలో భాగంగా తీసుకుంటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. కళ్ల మసక రాకుండా ఉంటుంది. త్రిఫలను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా అవుతుంది.

త్రిఫల నీటిని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయి. దీంతో శరీరాన్ని అనేక సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. త్రిఫల నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో అనేక సీజనల్ సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. వేగవంతమైన జీవక్రియ కారణంగా, శరీరంలో కొవ్వు వేగంగా తగ్గుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది.

త్రిఫల పానియాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా, జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, ఇది మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను బయటకు పంపి, తద్వారా పొట్టను శుభ్రంగా ఉంచి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. త్రిఫలను తీసుకోవడం వల్ల ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. దంతాల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. త్రిఫలను తీసుకుంటే పీరియడ్స్ సమస్యలు కూడా తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

త్రిఫలను తీసుకోవడం వల్ల చర్మంలో మెరుపు పెరుగుతుంది. యవ్వనంగా కనపడతారు. ముడతలు, మచ్చలు వంటి సమస్యలు కూడా ఉండవు. త్రిఫల మలబద్దకం సమస్యను పోగొడుతుంది. అజీర్తి వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. వాత, పిత్త, కఫ దోషాలని నయం చేయగలదు కూడా.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

 

 

Follow Us