వారెవ్వా.. అమేజింగ్.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?

వేసవి వచ్చిందంటే భానుడి భగభగలకు శరీరం త్వరగా అలసిపోతుంది. నీరసం, డీహైడ్రేషన్ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇలాంటి సమయంలో ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం కొబ్బరి నీళ్లు. అయితే చాలా మంది వీటిని కేవలం దాహం తీర్చుకోవడానికో లేదా సరదాకో తాగుతుంటారు. కానీ ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందంటే..?

వారెవ్వా.. అమేజింగ్.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?
Coconut Water On Empty Stomach

Updated on: Feb 25, 2026 | 6:55 AM

వేసవి వేడి మొదలైంది. ఎండలు మండుతుంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి నీళ్లు. అధిక చెమట, నీరసం నుంచి ఉపశమనం పొందడానికి ఇది ప్రకృతి ప్రసాదించిన వరం. అయితే కొబ్బరి నీళ్లను ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఉదయం ఖాళీ కడుపుతో తాగితే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డైటీషియన్ డాక్టర్ అనామిక కౌర్ వివరణ ప్రకారం.. కొబ్బరి నీళ్లు మన శరీరానికి ఒక నేచురల్ ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తాయి.

ఉదయం ఖాళీ కడుపుతో తాగితే కలిగే లాభాలు..

శరీరానికి రీ-హైడ్రేషన్: రాత్రిపూట నిద్రలో మన శరీరం కోల్పోయిన నీటిని తిరిగి నింపడానికి కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్లు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.

జీర్ణక్రియ మెరుగుదల: ఖాళీ కడుపుతో దీనిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

బీపీ నియంత్రణ: కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

చర్మ సౌందర్యం: శరీరం నుండి విషపూరిత వ్యర్థాలను తొలగించడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అలసట తగ్గి శరీరం పునరుజ్జీవింపబడుతుంది.

ఎంత తాగాలి? ఎప్పుడు తాగాలి?

నిపుణుల ప్రకారం.. రోజుకు ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు సరిపోతాయి. ఉదయం ఖాళీ కడుపుతో తాగడం అత్యంత ఉత్తమం. అయితే ఏదీ కూడా అతిగా తీసుకోకూడదు. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగితే శరీరంలో పొటాషియం స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.

వీరు జాగ్రత్తగా ఉండాలి..

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. తీవ్రమైన మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు లేదా మధుమేహంఉన్నవారు వీటిని తమ డైట్‌లో చేర్చుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

కేవలం కొబ్బరి నీళ్లు తాగడమే కాకుండా.. సమయానికి నిద్రపోవడం, వ్యాయామం చేయడం, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం వల్ల ఈ సహజ పానీయం యొక్క పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.

Follow Us