Onion for Hair: ఉల్లిపాయ రసం నిజంగానే జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుందా? ఇందులో నిజమెంత?

Hair Care Tips: ఇటీవలి కాలంలో చాలా మంది ఉల్లిపాయ రసం, ఉల్లిపాయలతో చేసిన నూనె జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుందని విశ్వసిస్తున్నారు. అందుకే ప్రజలు కూడా దీనిని విపరీతంగా వినియోగిస్తున్నారు.

Onion for Hair: ఉల్లిపాయ రసం నిజంగానే జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుందా? ఇందులో నిజమెంత?
Onion Hair Oil
Follow us

|

Updated on: Dec 15, 2022 | 7:23 PM

ఇటీవలి కాలంలో చాలా మంది ఉల్లిపాయ రసం, ఉల్లిపాయలతో చేసిన నూనె జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుందని విశ్వసిస్తున్నారు. అందుకే ప్రజలు కూడా దీనిని విపరీతంగా వినియోగిస్తున్నారు. అయితే, సైంటిఫిక్‌గా చూసుకుంటే.. ఇందులో అధిక మొత్తంలో సల్ఫర్ ఉండటం, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల కారణంగా జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక సులభంగా లభించే పదార్థం కావడంతో.. ఇది మరింత ప్రజాదరణ పొందింది. డెర్మటాలజిస్టుల ప్రకారం.. ‘జుట్టు కెరాటిన్(ప్రోటీన్)తో నిండి ఉంది. జుట్టులో సల్ఫర్ ఉంటుంది. ఉల్లిపాయ రసంలో కూడా సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని జుట్టుకు, తలకు పెట్టినప్పుడు.. జుట్టుకు మరింత శక్తిని ఇస్తుంది. తద్వారా జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. అదే సమయంలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.’

మరి సైన్స్ ఏం చెబుతుంది?

శరీరంలో కొన్ని హార్మోన్స్ లోపాల కారణంగా.. వెంట్రుకల కుదుళ్లు బలహీనం అవుతాయి. తద్వారా బట్టతల వస్తుంది. జుట్టు రాలే సమస్యల్లో ఆండ్రోజెనెటిక్ అలోపేసియా, అలోపేసియా అరేటా అనే రెండు సమస్యలుంటాయి. వీటిలో అలోపేసియా అరేటా సమస్యకు ఉల్లిపాయ రసం ప్రభావవంతంగా పని చేస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది. అదే సమయంలో ఆండ్రోజెనెటిక్ అలోపేసియాపై ఉల్లిపాయ రసం పని చేసినట్లు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

ఉల్లిపాయ రసంపై శాస్త్రీయ పరిశోధనలు లేవు..

జుట్టు మళ్లీ రావడానికి సంబంధించి ఉల్లిపాయ రసంపై ఎలాంటి పరిశోధనలు జరుగలేదని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. అయితే, ఉల్లిపాయ రసాన్ని రోజుకు రెండు సార్లు తలకు పట్టించడం ద్వారా కొంతమందిలో జుట్టు తిరిగి పెరగినట్లు ఒక చిన్న అధ్యయనంలో తేలిందన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న 74శాతం మందికి 4 వారాల తరువాత కొత్త వెంట్రుకలు తిరిగి పెరిగాయి. 6 వారాలలో 87 శాతం మందిలో జుట్టు తిరిగి పెరగడం కనిపించింది. అయితే, దీనిపై శాస్త్రీయ పరిశోధనలు మాత్రం జరుగలేదని నిపుణులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయతో జుట్టు, తలకు ఎలాంటి ప్రయోజనం..

ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది గాయాలను నయం చేయడంలో అద్భుతంగా పని చేస్తుంది. అదే సమయంలో జుట్టు సంబంధిత సమస్యల నివారణలో మంచి ఫలితాలను ఇస్తుంది. తలపై మచ్చలు ఏర్పడితే.. దానికి ఉల్లిపాయ రసం అప్లై చేయడం వల్ల అది క్రమంగా తగ్గుతుంది. తలపై ఏర్పడిన గాయాలు, మచ్చలను ఉల్లిపాయ రసం ప్రభావవంతంగా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా స్కాల్ఫ్ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది. జుట్టుకు రక్త ప్రసరణను పెంచుతుంది.

ఉల్లిపాయ రసాన్ని అందరూ పెట్టొచ్చా?

ఉల్లిపాయ రసాన్ని అందరూ ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి అది ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు. ఉల్లిపాయ రసాన్ని అప్లై చేయడం వలన చర్మవ్యాధి, జుట్టు రాలడం వంటి సమస్యలు ఏర్పడుతాయని చెబుతున్నారు. నిపుణులను సంప్రదించిన తరువాతే ఈ ఉల్లిపాయ రసాన్ని వినియోగించాలని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..