కుంకుమ్మ పువ్వుతో చేసే టీ తాగడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. మూడ్ స్వింగ్స్ సమస్యకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు.
మహిళలలో తలెత్తే నెలసరి సమస్యలకు కుంకుమ్మ పువ్వు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీ రోజూ పాలలో కలుపుకొని తీసుకుంటే మార్పు ఉంటుందని అంటున్నారు.
ఇక యాంటీ ఆక్సిడెంట్స్‌కు కుంకుమ్మ పువ్వు పెట్టింది పేరు. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. చర్మం మెరిసేలా చేస్తుంది.
ఇక పురుషుల్లో వచ్చే లైంగిక సంబంధిత సమస్యలకు కూడా కుంకుమ పువ్వు దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారు ప్రతీ రోజూ కుంకుమ పువ్వును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ప్రతీ రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో కొంచం కుంకుమ పువ్వును కలుపుకొని తీసుకుంటే మార్పు గమనించవచ్చు.
ఇక కాలేయ ఆరోగ్యాన్ని కూడా కాపాడడంలో కుంకుమ పువ్వు క్రీయాశీలకంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పాలలో కలుపుకొని తీసుకుంటే ఫలితం ఉంటుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.