ఆకుల్లో అద్భుతం.. డైలీ ఇలా చేశారంటే ఆ సమస్యలన్నీ పరారే.. లాభాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

జామకాయ, జామ ఆకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మధుమేహ నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుదల, బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం, చర్మ సంరక్షణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లతో నిండిన జామ ఆకుల టీ శరీరానికి మేలు చేస్తుందని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఆకుల్లో అద్భుతం.. డైలీ ఇలా చేశారంటే ఆ సమస్యలన్నీ పరారే.. లాభాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
Guava Leaves Health Benefits

Updated on: May 04, 2026 | 5:31 PM

జామకాయ, జామ ఆకులు అనేక శతాబ్దాలుగా సంప్రదాయ వైద్యంలో కీలకమైనవిగా పరిగణిస్తాయి.. వీటిలోని పోషకాలు.. ఆరోగ్యవంతంగా ఉండటంలో సహాయపడతాయి.. పేదవాడి ఆపిల్గా ప్రసిద్ధి చెందిన జామ.. మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికా నుండి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఎండ వాతావరణంలో కూడా ఏడాది పొడవునా కాసే ఈ పండ్లు, ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామపండులో నారింజ పండులో ఉండే విటమిన్-సి నిల్వల కంటే నాలుగు రెట్లు అధికంగా ఉంటుందని చెబుతారు. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

జామకాయ గింజల్లో ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం, కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు కూడా జామపండులో అధికంగా ఉంటాయి. జామపండు తినడం వల్ల జలుబు వస్తుందనే అపోహ ఉన్నప్పటికీ, దోరగా పండిన పండ్లు లేదా జలుబు చేసినప్పుడు గట్టి జామకాయ తినడం వల్ల జలుబు తగ్గుతుందని చెబుతారు.

జామ ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు:

జామ ఆకులు కూడా జామపండు వలె అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. జామ ఆకులతో తయారు చేసిన టీ అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది:

మధుమేహం నియంత్రణ: జామ ఆకుల రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. భోజనం తర్వాత జామ ఆకుల టీ తీసుకోవడం డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

గుండె ఆరోగ్యం: జామ ఆకుల్లోని యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను (HDL) పెంచుతాయి. ఇవి గుండెలో ఏర్పడే బ్లాక్‌లను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. శరీరంలోని వ్యర్థాలను తగ్గించి, అధిక రక్తపోటు (High BP) నుండి రక్షిస్తాయి.

జీర్ణక్రియ మెరుగుదల: జామ ఆకుల టీ మలబద్ధకం, డయేరియా, అన్నం అరగకపోవడం, వాంతులు, విరోచనాలు వంటి జీర్ణ సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. జామకాయలో తక్కువ కేలరీలు ఉండి, ఆకలిని తీర్చి, ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తుంది.

బరువు తగ్గడం: జామ ఆకుల టీ త్వరగా ఆకలి వేయకుండా చేసి, అనవసరమైన ఆహారాన్ని తినకుండా నియంత్రిస్తుంది. తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్ నివారణ: జామపండు, జామ ఆకుల్లో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయని చెబుతారు. ఇవి క్యాన్సర్ కణాల సంఖ్య పెరగకుండా నిరోధిస్తాయి. కొన్ని పరిశోధనల ప్రకారం, జామ ఆకుల రసం క్యాన్సర్‌పై మందుల కంటే నాలుగు రెట్లు అధిక ప్రభావం చూపుతుంది.

చర్మ ఆరోగ్యం: జామ ఆకులు చర్మానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. మొటిమలు, మచ్చలు, కణుతులు, ముడతలను తగ్గించి చర్మాన్ని తేటగా, మెరుస్తూ ఉంచుతాయి. జామ ఆకుల పేస్ట్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ రంధ్రాల్లోని ధూళి తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. పొటాషియం, ఫోలిక్ యాసిడ్, ఐసోఫ్లేవనాయిడ్స్, గాలిక్ యాసిడ్, ఆస్కోర్బిక్ యాసిడ్, కెరోటినాయిడ్స్ వంటివి చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి.

నోటి ఆరోగ్యం: జామ ఆకులను నమలడం లేదా టీ పుక్కిలించడం నోటి అల్సర్లు, నోటి దుర్వాసన, చిగుళ్ల ఇన్ఫెక్షన్‌లు, పంటి నొప్పి, పిప్పి పంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఇతర ప్రయోజనాలు: మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పిని తగ్గించడానికి జామ ఆకుల టీ సహాయపడుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలకు కూడా ఇవి మేలు చేస్తాయి.

జామ ఆకుల టీ తయారీ:

నాలుగు జామ ఆకులను శుభ్రంగా కడిగి, పది నిమిషాల పాటు నీటిలో ఉడికించి, ఆ నీటిని తాగాలి. ఇది తాగడానికి అంత రుచిగా లేకపోయినా, ఆరోగ్యానికి చాలా మంచిది.

జామ ఆకుల ఫేస్ ప్యాక్ తయారీ:

కొన్ని జామ ఆకులను శుభ్రంగా కడిగి, దంచి లేదా మిక్సీ పట్టి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మం మెరుస్తుంది. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

ఇలా జామకాయ, జామ ఆకులను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు..

గమనిక: ఈ వార్తా కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలున్నా.. సందేహాలున్నా నేరుగా వైద్య నిపుణులను సంప్రదించండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us