
అరటి పండ్లు అన్ని సీజన్లలో అందుబాటులో ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వీటిని పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. అయితే వీటిని నిల్వ ఉంచడం అంత సులువేం కాదు, ఒక్క రోజులోనే పచ్చిగా ఉండి మరుసటి రోజుకి పండిపోతాయి, రెండు రోజులయ్యిదంటే చాలు నల్ల మచ్చలు పడి, మూడో రోజు పూర్తిగా మెత్తబడిపోతాయి. అరటి పండ్లు త్వరగా పండిపోవడానికి కారణం అవి విడుదల చేసే ఎథిలీన్ అనే గ్యాస్. ఈ గ్యాస్‌ను కంట్రోల్ చేస్తే అరటిపండ్లను 10–15 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంచవచ్చు. చిన్నచిన్న జాగ్రత్తలతో అరటిపండ్లను ఎలా తాజాగా ఉంచాలో తెలుసుకుందాం..
* ఎథిలీన్ గ్యాస్ ఎక్కువగా కాడ వైపు నుంచే బయటకు వస్తుంది. ఆ భాగాన్ని క్లింగ్ ఫిల్మ్ లేదా ఎడిబుల్ ప్లాస్టిక్‌తో గట్టిగా చుట్టేయండి. ఇలా చేస్తే 4–6 రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి.
* ప్లాస్టిక్ ర్యాప్ లేకపోతే అల్యూమినియం ఫాయిల్‌తో కాడను కప్పండి. ఇది గ్యాస్‌ను రిఫ్లెక్ట్ చేసి పండ్లను త్వరగా పండకుండా చూస్తుంది.
* అరటి పండ్లు గుత్తిగా ఉంటే ఒక్కటి పండితే మిగతావన్నీ త్వరగా పండిపోతాయి. అందువల్ల గెల నుంచి ఒక్కొక్కటిగా విడదీసి ఉంచాలి.
* అరటి పండ్లను కాడ కిందికి వచ్చేలా వేలాడదీయాలి. ఇలా చేస్తే మాయిశ్చర్ కాడ వైపు చేరకుండా ఉంటుంది.
* పండ్లను బ్రౌన్ పేపర్ బ్యాగ్‌లో వేసి మూసి ఉంచాలి. ఎథిలిన్ గ్యాస్ బ్యాగ్‌లోనే ఆగిపోతుంది. త్వరగా పండాలంటే ఆపిల్ లేదా టమాటాను జోడించాలి.
* అరటి పండ్లు కట్ చేసిన తర్వాత త్వరగా నలుపు పట్టకుండా నిమ్మరసం లేదా నారింజ రసం స్ప్రే చేయాలి. సిట్రిక్ యాసిడ్ ఆక్సిడేషన్‌ను ఆపుతుంది.
* కట్ చేసిన ముక్కలను తేనెలో ముంచి ఫ్రిజ్‌లో పెడితే యాంటీ-ఆక్సిడెంట్స్ బ్రౌనింగ్‌ను ఆలస్యం చేస్తాయి. ఎక్కువ కాలం ఉంచాలంటే తొక్క తీసి, పీసెస్‌గా కట్ చేసి జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి ఫ్రీజర్‌లో పెట్టండి. 2–3 నెలల వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. స్మూతీలకు డైరెక్ట్‌గా వాడుకోవచ్చు.
ఈ సింపుల్ హ్యాక్స్‌తో అరటిపండ్లు త్వరగా పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. మీరూ ట్రై చేసి చూడండి మరి!