ఖాళీ కడుపుతో రోజూ ఒక స్పూన్ నువ్వులు తిన్నారంటే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! పోషక విలువలు తెలిస్తే

ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు నువ్వుల్లో దండిగా ఉంటాయి. రోజువారీ ఒక చెంచా నువ్వులను ఖాళీ కడుపుతో తీసుకుంటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను ఎవరూ ఊహించలేరు. ఎముకల ఆరోగ్యం, క్యాల్షియం లోపానికి నువ్వులు సహజ ఔషధంగా పనిచేస్తాయి. నువ్వులు బాగా నమిలి నూనె భాసం అయిన తర్వాత నీళ్లు తాగాలి. ఈ ప్రక్రియను కేవలం ఏడు రోజులు పాటిస్తే చాలు తలతిరుగుడు తగ్గిపోతుంది. 21 రోజులు పూర్తి చేసేసరికి లేచి నిలబడగలుగుతారు. పూర్తి ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం...

ఖాళీ కడుపుతో రోజూ ఒక స్పూన్ నువ్వులు తిన్నారంటే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! పోషక విలువలు తెలిస్తే
Sesame Seeds

Updated on: Mar 13, 2026 | 7:15 PM

రోజువారీ నువ్వుల వినియోగం ఎముకల ఆరోగ్యాన్ని, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో ఎంతగానో సహాయపడుతుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేవగానే తలతిరుగుడు, మైగ్రేన్ తలనొప్పి వంటి సమస్యలు ఉన్నవారికి నువ్వులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. స్టెరాయిడ్ మాత్రలు వాడటం వల్ల కీళ్ళు, కాళ్ళు వాపు వచ్చి నడవలేని స్థితికి చేరుకుంటారు. కానీ, ఒక ఇనుప పెన్నంపై ఒక చెంచా నువ్వులను సన్నటి మంటపై టప్ టప్ అనే వరకు వేడి చేసి, చల్లార్చి, పడిగడుపున నోట్లో వేసుకుని నమిలి తినడం అలవాటు చేసుకున్నారంటే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. నువ్వులు బాగా నమిలి నూనె భాసం అయిన తర్వాత నీళ్లు తాగాలి. ఈ ప్రక్రియను కేవలం ఏడు రోజులు పాటిస్తే చాలు తలతిరుగుడు తగ్గిపోతుంది. 21 రోజులు పూర్తి చేసేసరికి లేచి నిలబడగలుగుతారు.

నువ్వులు క్యాల్షియం, ఇనుము, ఇతర పోషకాలకు గొప్ప వనరులు. ఇవి ఎముకలను దృఢంగా చేయడమే కాకుండా, శరీరానికి శక్తిని అందించి, సాధారణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ సహజసిద్ధమైన చిట్కా ఎముకల ఆరోగ్యం, మైగ్రేన్, తలతిరుగుడు వంటి వాటికి సులువైన పరిష్కారాన్ని అందిస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం.. తేనె, నువ్వుల మిశ్ర‌మం అనేక పోష‌కాలను క‌లిగి ఉంటుంది. వీటిని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తింటే అనేక ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి. తేనె, నువ్వులు రెండింటిలోనూ ప్రోటీన్లు, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. దీంతో ఇవి శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి. ప్రోటీన్ల వల్ల కణజాలం వృద్ధి చెందుతుంది. కండ‌రాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. ఉద‌యాన్నే ఈ మిశ్ర‌మాన్ని తిన‌డం వ‌ల్ల రోజంతా శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. దీంతో ఉత్సాహంగా ఉంటారు. నీర‌సం, అల‌స‌ట త‌గ్గుతాయి. బ‌ద్ద‌కం పోతుంది. అలాగే ఈ మిశ్ర‌మంలో ఉండే క్యాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.

ఇవి కూడా చదవండి

పిల్లలకు తేనె, నువ్వులను రోజూ పెడితే పోషణ సరిగ్గా అందుతుంది. మెద‌డు యాక్టివ్‌గా మారి చ‌దువుల్లో రాణిస్తారు. తేనె, నువ్వులు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. తేనె, నువ్వులు కలిపి తినటం వల్ల ఇన్‌స్టంట్ ఎనర్జీ అందుతుంది. ఉదయాన్నే శక్తి అందడం వల్ల బాడీ యాక్టివ్‌గా ఉంటుంది. రోజంతా ఉల్లాసంగా ఉంటారు. ఈ మిశ్ర‌మాన్ని తిన‌డం వ‌ల్ల మ‌హిళ‌ల‌కు సైతం ఎంతో మేలు జ‌రుగుతుంది. మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు, తిమ్మిర్లు తగ్గుతాయి. వాపుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

 

 

 

 

Follow Us