బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్లేట్‌లెట్స్ సంఖ్యను పెంచడం దగ్గర్నుంచి దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పచ్చి బొప్పాయి కాయలతో పచ్చడి చేస్తారన్న సంగతి మీకు తెలుసా..? అవునండీ నిజం. ఈ చట్నీ నిజానికి బెంగాలీ ప్రజల ప్రసిద్ధ వంటకం కూడా. ఇది రుచిగా కూడా ఉంటుంది. అంతేకాదు ఆరోగ్యానికి కూడా మంచిది. పచ్చి బొప్పాయి, చక్కెర, ఉప్పు, కొన్ని ప్రత్యేక మసాలా దినుసులతో దీన్ని తయారు చేస్తారు. ఈ ప్రత్యేక చట్నీని పెద్ద పెద్ద ఈవెంట్‌లు, పండుగల సందర్భంగా పెడుతుంటారు. అయితే దీన్ని ఎలా చేయాలి..? ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
1/2 కప్పు తరిగిన పచ్చి బొప్పాయి
1/2 కప్పు చక్కెర
తగినంత ఉప్పు
1/2 టీస్పూన్ నిమ్మరసం
1/2 కప్పు నీరు
1/2 టేబుల్ స్పూన్ నెయ్యి
యాలకులు 2
1/2 స్పూన్ నల్ల జీలకర్ర
కుంకుమపువ్వు
జీడిపప్పు తగినంత
1. ముందుగా ఒక పచ్చి బొప్పాయిని తీసుకుని, గింజలను తీసివేసి సన్నగా తురమాలి
2. ఆ తురిమిన బొప్పాయిని ఒక గిన్నె నీటిలో వేసి సుమారు 10-15 నిమిషాలు నానబెట్టండి. ఈ విధానాన్ని 2-3 సార్లు పునరావృతం చేయండి, ఆపై నీటి నుండి తొలగించండి.
3. తర్వాత ఒక పాత్రలో కొంచెం నెయ్యి వేసి వేడి చేయాలి. నానబెట్టిన బొప్పాయి ముక్కలను అందులో వేయాలి. తర్వాత రెండు నిమిషాలు బాగా వేయించాలి. తర్వాత నీళ్లు పోసి మరిగించాలి. తర్వాత అందులో పంచదార, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి.
4. ఆ తర్వాత మీరు కొంచెం నిమ్మరసం జోడించవచ్చు. తరువాత, యాలకులు, కలోంజి గింజలు (కాలా జీర సీడ్), అవసరమైనంత ఉప్పు వేయండి.
5. వీటన్నింటిని కలిపిన తర్వాత బాగా ఉడికించాలి. పైన వేయించిన జీడిపప్పును చల్లితే బొప్పాయి చట్నీ తినేందుకు రెడీ అయినట్లే.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి