
చిరు దాన్యాల్లో ఒకటి రాగులు. వీటిని ఫింగర్ మిల్లెట్స్ అని కూడా అంటారు. వాస్తవానికి ధాన్యాలన్నిటిలోకి రాగులు మంచి ఆరోగ్యకరమైన పోషకాహారం. ముఖ్యంగా రాగుల్లో ఉండే అధిక పోషక విలువలు, ఫైబర్ కంటెంట్ వలన పిల్లలకు మంచి ఆహారంగా భావిస్తారు, అంతేకాదు రాగులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి. కావాల్సిన పదార్ధాలు : రాగి పిండి – 1 కప్పు అటుకులు పొడి – అర కప్పు వేయించిన వేరుశెనగలపొడి – అర కప్పు పచ్చికొబ్బరి తురుము – 1 కప్పు బెల్లం – 1 కప్పు నెయ్యి – కావల్సినంత యాలకుల పొడి – 1 టీస్పూన్ నీళ్ళు – పావు కప్పు ఉప్పు- కొంచెం ముందుగాస్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో పావు కిలో బెల్లం పొడిని వేసుకుని పావు కప్పు నీరు వేసి బాగా కరిగేలా బబుల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. తర్వాత ఆ బెల్లం నీరుని ఒక పక్కకు పెట్టి.. ఇప్పుడు ఒక బాణలి పెట్టుకుని అందులో ఒక కప్పు రాగి పిండి వేసుకుని మంట తక్కువగా పెట్టి వేయించాలి. తర్వాత అటుకుల పిండిని వేసి వేయించి తర్వాత వేయించి పొడి చేసిన వేరుశనగ పప్పు పొడిని, పచ్చి కొబ్బరి తురుముని వేసి వేయించుకోవాలి. పిండి వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బెల్లం నీరుని వేసి బాగా ఉండలు లేకుండా రాగి మిశ్రమాన్ని కలపాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి, యాలకుల పొడి,కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి. ఇపుడు...