Fish Curry : అయ్యో పాపం.. రాత్రి చేపల పులుసు తిన్నారు.. తెల్లారికి విగత జీవులయ్యారు

రాత్రి చేపల పులుసు తిన్నారు. ఉదయాన్నే విగతజీవులుగా కనిపించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. బీహార్ రాష్ట్రంలోని చాప్రా మండలం దరియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని..

Fish Curry : అయ్యో పాపం.. రాత్రి చేపల పులుసు తిన్నారు.. తెల్లారికి విగత జీవులయ్యారు
Fish Curry

Updated on: Jul 27, 2021 | 11:49 AM

Fish Curry – Poisoned fish: రాత్రి చేపల పులుసు తిన్నారు. ఉదయాన్నే విగతజీవులుగా కనిపించారు. తనయుడు, మేనళ్లుడు చనిపోగా,  చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. బీహార్ రాష్ట్రంలోని చాప్రా మండలం దరియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సద్వారా గ్రామంలో ఈ ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే, సద్వారా గ్రామంలోని ఒక కుటుంబం పెళ్లి విందుకి వెళ్లి రాత్రి అక్కడ చేపల కూరతో భోజనం చేశారు. తర్వాత ఇంటికి వచ్చి అందరూ నిద్రలోకి జారుకున్నారు.

అయితే, తమకు ఏదో అవుతుందని తెలిసే లోపే వీరందరి ఆరోగ్యం విషమించిపోయింది. విషాహారం తిన్న కొడుకు, మేనళ్లుడు నిద్రలోనే చనిపోగా, తీవ్ర అస్వస్థతకు లోనైన కుటుంబ పెద్దను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే సమయానికే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర అనారోగ్యానికి గురైన చిన్నారికి స్థానిక పిఎంసిహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు.

చేపల కూర తిని నిద్రపోయిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు నిద్రలోనే చనిపోవడంతో సద్వారా గ్రామంలో విషాదం నెలకొంది. ఆహారం విషపూరితం కావడంతోనే వీరి మరణాలు సంభవించాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే,  ఆహారం ఎక్కడ విషతుల్యమైంది.? బాధితుల సంఖ్యకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Read also : Chennai : చెన్నై నగరాన్ని చుట్టి రావాలంటే ఇకపై చాలా ఈజీ.. కేవలం రెండున్నర గంటలు చాలట.!

Loading...
Unable to load recommendations.
Follow Us