Telugu News Lifestyle Food Navaratri special: simple and delicious coconut kheer recipe bhog for maa mahagauri
నవరాత్రి 8వ రోజున మహాగౌరికి కొబ్బరి పాయసం సమర్పించండి.. రెసిపీ చాలా సులభం.
నవరాత్రి ఎనిమిదవ రోజు దుర్గాష్టమి. ఈ రోజు దుర్గాదేవి ఎనిమిదవ రూపమైన మహాగౌరి దేవిని పూజిస్తాము. పురాణాల ప్రకారం మహా గౌరికి కొబ్బరికాయ అంటే ఇష్టం. కనుక దుర్గా అష్టమి రోజున అమ్మవారికి కొబ్బరి పాయసాన్ని సమర్పించడం శుభప్రదం. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, తయారు చేయడం కూడా చాలా సులభం. రెసిపీ తెలుసుకుందాం.
నవరాత్రి పండుగలో ఎనిమిదవ రోజున దుర్గాష్టమిగా జరుపుకుంటున్నారు. నవరాత్రి ఎనిమిదవ రోజున మహాగౌరి దేవిని పూజిస్తారు. మహాగౌరిని పూజించడం వల్ల భక్తులు అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారని, జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. నవరాత్రి ఎనిమిదవ రోజు మహాగౌరి దేవికి ప్రత్యేకంగా ఏదైనా సమర్పించాలని ఆలోచిస్తుంటే.. అమ్మవారికి ఇష్టమైన కొబ్బరి పాయసం ఉత్తమ ఎంపిక.
మహాగౌరి అమ్మవారికి కొబ్బరి కాయ అంటే చాలా ఇష్టం. అందుకే అష్టమి రోజున కొబ్బరి ఖీర్ ను మహా గౌరికి నైవేద్యం పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఇది రుచికరమైనది మాత్రమే కాదు.. పాలు, కొబ్బరి సువాసన మీ ఇంటి మొత్తాన్ని నింపుతుంది. ఇది చాలా సులభమైన వంటకం. రెసిపీ తెలుసుకుందాం.