
మన వంటగదిలో దొరికే యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క కేవలం రుచికే కాదు, బరువు తగ్గడానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ మూడు సుగంధ ద్రవ్యాల పొడులను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో మెటబాలిజం వేగవంతమై, కొవ్వు వేగంగా కరుగుతుంది. యాలకులు, లవంగాలు, దాల్చినచెక్కలలో యాంటీఆక్సిడెంట్లు, శోథ నిరోధక (Anti-inflammatory) గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని జీవక్రియను (Metabolism) వేగవంతం చేస్తాయి. మెటబాలిజం రేటు పెరిగినప్పుడు, శరీరం విశ్రాంతి స్థితిలో ఉన్నా కూడా క్యాలరీలు, కొవ్వు వేగంగా కరుగుతాయి.
ఈ మూడు పొడుల మిశ్రమం జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీనివల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమై, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. జీర్ణవ్యవస్థ బాగుంటే బరువు తగ్గడం మరింత సులువవుతుంది. ముఖ్యంగా దాల్చినచెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం ద్వారా మాటిమాటికీ ఆకలి వేయడాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల మనం అనవసరమైన జంక్ ఫుడ్ తినకుండా నియంత్రించుకోవచ్చు. ఈ మిశ్రమం శరీరంలో పేరుకుపోయిన హానికరమైన టాక్సిన్స్ బయటకు పంపడంలో సహాయపడుతుంది. లవంగాల్లో ఉండే యాంటీబాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఎలా ఉపయోగించాలి?: సమాన పరిమాణంలో యాలకులు, లవంగాలు, దాల్చినచెక్కలను తీసుకుని దోరగా వేయించి, మిక్సీలో మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకోవాలి.
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర చెంచా ఈ పొడిని కలిపి తాగాలి. రుచి కోసం కావాలనుకుంటే కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు. ఈ సహజసిద్ధమైన పొడిని రోజూ తీసుకుంటూ, దాంతో పాటు సరైన పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కేవలం కొన్ని వారాల్లోనే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగి, ఆరోగ్యకరమైన మార్పును గమనించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..