Kerala Egg Curry: కేరళ హోటల్ స్టైల్ ఎగ్ కర్రీ.. కొబ్బరి పాలతో ఇలా చేస్తే చపాతీ, దోసెల్లోకి అమృతంలా ఉంటుంది!

కేరళ అనగానే అందరికీ గుర్తొచ్చేది అప్పం ముత్త కర్రీ. చిక్కటి కొబ్బరి పాలు, మసాలాల మిశ్రమంతో చేసే ఈ గుడ్డు కూర రుచి చాలా విభిన్నంగా ఉంటుంది. కేరళ వరకు వెళ్లకుండానే, అదే రుచితో మీ వంటింట్లో ఈ స్పెషల్ కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ రెసిపీని ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

Kerala Egg Curry: కేరళ హోటల్ స్టైల్ ఎగ్ కర్రీ.. కొబ్బరి పాలతో ఇలా చేస్తే చపాతీ, దోసెల్లోకి అమృతంలా ఉంటుంది!
Kerala Style Mutta Curry

Updated on: Feb 19, 2026 | 3:45 PM

 

సాధారణ గుడ్డు కూర తిని బోర్ కొట్టిందా? అయితే కేరళ హోటళ్లలో ఫేమస్ అయిన ‘ముత్త కర్రీ’ని ఒక్కసారి ప్రయత్నించండి. చిక్కటి కొబ్బరి పాలు, ఘాటైన మిరియాల పొడి, కొబ్బరి నూనె సువాసనతో ఈ కూర మీ బ్రేక్‌ఫాస్ట్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తుంది. ఆ అద్భుతమైన రెసిపీ వివరాలు మీకోసం..

కావలసిన పదార్థాలు:

ఉడకబెట్టిన గుడ్లు – 4

కొబ్బరి నూనె – 4 టేబుల్ స్పూన్లు

ఆవాలు – ¼ టీస్పూన్

పెద్ద ఉల్లిపాయ – 1 (సన్నని తరుగు)

పచ్చిమిరపకాయలు – 3 (చీలికలు)

కరివేపాకు – 2 రెబ్బలు

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు

టమోటా – 1 (సన్నని తరుగు)

పసుపు పొడి – ¼ టీస్పూన్

కాశ్మీరీ కారం పొడి – 1 టేబుల్ స్పూన్

మిరియాల పొడి – 1 టీస్పూన్

గరం మసాలా – 1 ½ టీస్పూన్

ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్

జీలకర్ర పొడి – ½ టీస్పూన్

చిక్కటి కొబ్బరి పాలు – 2 కప్పులు

ఉప్పు – రుచికి సరిపడా

కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం.. 

కేరళ వంటకాలకు కొబ్బరి, కొబ్బరి నూనె ప్రాణం పోస్తాయి. అప్పం, ఇడియాప్పం, పరోటా లేదా దోసెల్లోకి ఈ ‘ముత్త కర్రీ’ ఒక అద్భుతమైన కాంబినేషన్. ఈ రెసిపీలో ఉండే క్రీమీ టెక్స్చర్ ఏ ఇతర కూరలోనూ కనిపించదు.

తయారీ విధానం:

ముందుగా గుడ్లను ఉడకబెట్టి, తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. వీటికి చిన్న గాట్లు పెడితే గ్రేవీలోని మసాలాలు లోపలికి బాగా పడతాయి.

బాణలిలో కొబ్బరి నూనె వేసి వేడయ్యాక ఆవాలు వేయాలి. అవి చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా ఉప్పు చల్లి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేగనివ్వాలి.

ఇప్పుడు పసుపు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి మసాలాలు మాడకుండా కలపాలి. మసాలాల నుంచి నూనె వేరవుతున్నప్పుడు టమోటా ముక్కలు వేసి మెత్తగా ఉడికించాలి.

గ్రేవీ చిక్కగా తయారైన తర్వాత మంటను బాగా తగ్గించి, చిక్కటి కొబ్బరి పాలు పోయాలి. అవసరమైన ఉప్పు చూసుకుని, ఉడకబెట్టిన గుడ్లను ఇందులో వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుంటే ఘుమఘుమలాడే కేరళ ఎగ్ కర్రీ సిద్ధం!

Follow Us