భారతదేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ తరుణంలో సాంప్రదాయ వంటకాలు ప్రధాన వేదికగా నిలుస్తాయి. ఈ రంగురంగుల వంటకాలు కుటుంబాలను ఒకచోట చేర్చి, ఆహారం ద్వారా జాతీయ గౌరవాన్ని వ్యక్తపరుస్తాయి. రుచికరమైన ఆహారానికి జెండాలోని త్రివర్ణాలను అద్దుతూ వైవిద్యంగా తయారు చేసుకోవాలనుకుంటే రాజస్తాన్ స్పెషల్ స్వీట్ మలై ఘేవర్ ను ట్రై చేయండి.
ఆ సేతు హిమాచలం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఆగస్టు 15 ఉదయం నుంచే త్రివర్ణ పతాక రెపరెపలాడుతుండటం, దేశభక్తి గీతాల ప్రతిధ్వనులు, స్వేచ్చ, గర్వం వెచ్చదనంతో మేల్కొంటుంది. వీధులు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులలో పెయింట్ చేయబడ్డాయి. మార్కెట్లు జెండాలు, బ్యాడ్జ్‌లు, స్వీట్లు కొనుగోలు చేసే వ్యక్తులతో సందడిగా మారాయి. ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన వారితో కలిసి కలిసికట్టుగా జరుపుకుంటున్నారు. ఎర్రకోటపై జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని వర్చువల్‌గా చూస్తూ అందిస్తూ.. రుచికరమైన ఆహారానికి జెండాలోని త్రివర్ణాలను అద్దుతూ వైవిద్యంగా తయారు చేసుకోవాలనుకుంటే రాజస్తాన్ స్పెషల్ స్వీట్ మలై ఘేవర్ ను ట్రై చేయండి. రాజస్థానీ స్వీట్ మలై ఘేవర్ తయారీ విధానం మీ కోసం
మందపాటి అడుగున ఉన్న పాన్‌లో తీసుకుని స్టవ్ మీద పెట్టి నెయ్యి వేడి చేసి.. ఐస్‌తో చల్లబరిచి, మలినాలను వేరు చేయండి.
నెయ్యిని చిలికి స్మూతీగా చేయండి.. ఇందులో కొంచెం కొంచెం మైదావేసి కలిగి.. ఆపై నీరు వేసి కలుపుతూ పిండిని ఉండే పిండిలా చేయండి.
పాన్ లో వేయించడానికి సరిపడా నెయ్యి వేసి వేడి చేసి, ప్రత్యేకమైన ఘేవర్ వృత్తాకార అచ్చు తీసుకుని మధ్యలో రెడీ చేసుకున్న మైదా పిండి మిశ్రమాన్ని పోసి.. బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
ఇంతలో సిరప్ రెడీ చేసుకోండి. నీరు , చక్కెర పూర్తిగా కరిగిపోయే వరకు వేడి చేసి చక్కెర సిరప్ సిద్ధం చేసుకోండి. దానికి కుంకుమపువ్వు జోడించండి.
వేయించిన ఘేవర్‌ను వెచ్చని సిరప్‌లో ముంచి తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోండి.
మలై కోసం పాలు, చక్కెర, యాలకుల పొడి, కుంకుమపువ్వు, పచ్చి బఠానీ ప్యూరీని వేడి చేసి మంట తగ్గించి, చిక్కబడే వరకు చల్లబరచండి.
ఘేవర్ పైన మలైతో అలంకరించి.. డ్రై ఫ్రూట్స్ ముక్కలతో అలంకరించండి.
మలై ఘేవర్ మాధుర్యం రాజస్థాన్ సాంస్కృతిక వేడుకలను సూచిస్తుంది. దీనిని ఇంట్లోనే చాలా సులభం తయారు చేసుకుని అతిథులకు అందించండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)