Mushroom Masala Curry: మష్రూమ్స్‌తో ఇలా మసాలా కర్రీ చేయండి.. ఎందులోకైనా అదిరిపోతుంది!

మనం తీసుకునే ఆహారంలో పుట్ట గొడుగులు కూడా ఒకటి. కొంత మంది వీటిని ఇష్టంగా తింటే.. మరికొంత మంది అస్సలు తీసుకోరు. కానీ పుట్ట గొడుగుల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. మష్రూమ్స్‌ హెల్త్‌కి ఎంతో మంచిది. సరిగ్గా వండాలే కానీ.. ఇవి కూడా చికెన్, మటన్ ఉన్నంత టేస్టుగా ఉంటాయి. పుట్ట గొడుగులను అలా వండితేనే వాటి రుచి కూడా బావుంటుంది. మరి రెస్టారెంట్ స్టైల్‌లో..

Mushroom Masala Curry: మష్రూమ్స్‌తో ఇలా మసాలా కర్రీ చేయండి.. ఎందులోకైనా అదిరిపోతుంది!
Mushroom Masala Curry 1
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 24, 2024 | 10:50 PM

మనం తీసుకునే ఆహారంలో పుట్ట గొడుగులు కూడా ఒకటి. కొంత మంది వీటిని ఇష్టంగా తింటే.. మరికొంత మంది అస్సలు తీసుకోరు. కానీ పుట్ట గొడుగుల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. మష్రూమ్స్‌ హెల్త్‌కి ఎంతో మంచిది. సరిగ్గా వండాలే కానీ.. ఇవి కూడా చికెన్, మటన్ ఉన్నంత టేస్టుగా ఉంటాయి. పుట్ట గొడుగులను అలా వండితేనే వాటి రుచి కూడా బావుంటుంది. మరి రెస్టారెంట్ స్టైల్‌లో మష్రూమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మష్రూమ్స్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు:

పుట్ట గొడుగులు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటాలు, కొత్తి మీర, కరివేపాకు, ధనియాల పొడి, బటర్, ఆయిల్, జీడిపప్పు పొడి, కసూరి మేథీ పొడి, పెరుగు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు.

మష్రూమ్స్ మసాలా కర్రీ తయారీ విధానం:

ముందుగా పుట్ట గొడుగులను వేడి నీటిలో శుభ్రంగా కడిగి తీసుకోవాలి. వీటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులోకి గరం మసాలా, కసూరి మేథీ, మిరియాల పొడి, పసుపు, పెరుగు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కర్రీ పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్ వేసి. జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేగాక.. ఉల్లి పాయలు, పచ్చి మిర్చి వేసి వేయించాలి. ఇవి రంగు మారాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయాక ఫ్రై చేయాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు వేసి గరిటెతో కలుపుకోవాలి.

ఇవి కూడా చదవండి

అవన్నీ వేగాక.. సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసి కలపాలి. ఇవి కూడా మగ్గిన తర్వాత కలిపి పెట్టుకున్న పుట్ట గొడుగులను కూడా వేసి ఓ పది నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి కూడా వేగాక నీళ్లు, గరం మాసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి.. ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడ్డాక కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపి సర్వ్ చేయడమే. అంతే ఎంతో రుచిగా ఉండే మష్రూమ్స్ మసాలా కర్రీ సిద్ధం.