Pepper Rice: టేస్టీ పెప్పర్ రైస్.. ఈ సీజన్‌కి బెస్ట్ రెసిపీ ఇదే!

వాతావరణ పరిస్థితులు మారినప్పుడు.. అందుకు అనుగుణంగా ఉండే ఆహార పదార్థాలు కూడా మీ డైట్‌లోకి చేర్చుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. వర్షా కాలం, శీతా కాలంలో ఈ రెసిపీ ఎంతో హ్యాపీగా తినవచ్చు. వేడి చేస్తుందని భయం ఉండదు. పెప్పర్ రైస్‌ని బ్రేక్ ఫాస్ లేదా లంచ్‌లోకి కూడా తీసుకొచ్చు. ఎంతో సులభంగా, తక్కువ సమయంలోనే ఈ రైస్ తయారు చేయవచ్చు. ఈ రైస్‌లోకి కాంబినేషన్‌గా ఎలాంటి కర్రీలైనా తీసుకోవచ్చు. చాలా మందికి తెలీదు మిరియాలతో కూడా అన్నం..

Pepper Rice: టేస్టీ పెప్పర్ రైస్.. ఈ సీజన్‌కి బెస్ట్ రెసిపీ ఇదే!
Pepper Rice
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 24, 2024 | 10:50 PM

వాతావరణ పరిస్థితులు మారినప్పుడు.. అందుకు అనుగుణంగా ఉండే ఆహార పదార్థాలు కూడా మీ డైట్‌లోకి చేర్చుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. వర్షా కాలం, శీతా కాలంలో ఈ రెసిపీ ఎంతో హ్యాపీగా తినవచ్చు. వేడి చేస్తుందని భయం ఉండదు. పెప్పర్ రైస్‌ని బ్రేక్ ఫాస్ లేదా లంచ్‌లోకి కూడా తీసుకొచ్చు. ఎంతో సులభంగా, తక్కువ సమయంలోనే ఈ రైస్ తయారు చేయవచ్చు. ఈ రైస్‌లోకి కాంబినేషన్‌గా ఎలాంటి కర్రీలైనా తీసుకోవచ్చు. చాలా మందికి తెలీదు మిరియాలతో కూడా అన్నం తయారు చేసుకోవచ్చుని. ఈ రైస్ ఆరోగ్యమే కాకుండా రుచిగా కూడా ఉంటుంది. మరి ఈ పెప్పర్‌ రైస్‌ని ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మిరియాల రైస్‌కి కావాల్సిన పదార్థాలు:

ఉడికించిన అన్నం, మిరియాల పొడి, మిరియాలు, జీలకర్ర, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఆవాలు, శనగ పప్పు, కరివేపాకు, కొత్తి మీర, నెయ్యి లేదా నూనె, వేరు శనగ, ఇంగువ, ఉప్పు, జీడిపప్పు.

మిరియాల రైస్‌ తయారీ విధానం:

ముందుగా స్టవ్ మీద నెయ్యి లేదా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. మిరియాల రైస్‌కి నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ మిరియాలు వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి. ఇవి వేగాక ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఆ తర్వాత వీటిని పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్లీ కడాయిలో ఆయిల్ లేదా ఘీ వేసి వేడి చేయాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఆవాలు జీలకర్ర, ఎండు మిర్చి, శనగ పప్పు వేసి వేగాక కరివేపాకు వేసి వేయించాలి. ఆ నెక్ట్స్ ఇంగువ పొడి, జీడి పప్పు, పల్లీలు, పచ్చి మిర్చి ఇలా ఒకదాని తర్వాత వేసి వేయిస్తూ ఉండాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి ఓ ఐదు నిమిషాలు కలుపుకోవాలి. ఆ నెక్ట్స్ మిక్సీ పట్టిన మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపు కోవాలి. అన్నీ బాగా మిక్స్ చేశాక చివరిలో కొత్తిమీర చల్లి దింపేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మిరియాల రైస్ సిద్ధం.