పక్షవాతం వచ్చిందేమోనని భయపడ్డాను: జాన్వీ కపూర్
TV9 Telugu
24 July 2024
అందాల తార దివంగత శ్రీదేవి కూతురు, దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న జాన్వీకి ఫుడ్ పాయిజన్ కావడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు.
దాదాపు రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత కానీ ఈ అందాల తార సాధారణ స్థితికి చేరుకోలేదు
తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన జాన్వీ కపూర్ ఫుడ్ పాయిజన్‌తో చాలా భయానికి గురైనట్లు వెల్లడించింది.
' ఒక సినిమా ఈవెంట్ కోసం చెన్నైకి వెళ్లాను. అక్కడ విమానాశ్రయంలో ఆహారం తీసుకున్నా. మొదట కడుపులో నొప్పిగా అనిపించింది'
'ఆ తర్వాత కాసేపటికే చాలా నీరసం వచ్చేసింది. దీంతో భయంతో వణికిపోయాను. పక్షవాతం వచ్చిందా అన్న ఫీలింగ్ కలిగింది'
'సాయం లేకుండా కనీసం వాష్‌రూమ్‌కు కూడా వెళ్లలేకపోయాను. ఆస్పత్రిలో రిపోర్డులు చూసిన డాక్టర్లు సైతం భయపడ్డారు'
'దీంతో మూడు, నాలుగు రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆరోగ్య పరిస్థితి చాలా భయానకంగా ఉంది. న్నా' అని జాన్వీ చెప్పుకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి..