Egg Chat: టేస్టీ ఎగ్ చాట్.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..
కోడి గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ప్రతి రోజూ ఓ కోడి గుడ్డు తినమని ప్రభుత్వం కూడా చెబుతుంది. గుడ్డులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అందులోనూ పిల్లలకు ఇవ్వడం చాలా మంచిది. వారి శరీరం గ్రోత్ అవ్వడానికి చాలా పోషకాలు అవసరం అవుతాయి. గుడ్డుతో ఎన్నో రకాల వెరైటీలు మనం తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ ఒకేలా ఇస్తే పిల్లలకు కూడా బోర్ కొడుతుంది. ఒక్కసారి ఎగ్ చాట్..

కోడి గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ప్రతి రోజూ ఓ కోడి గుడ్డు తినమని ప్రభుత్వం కూడా చెబుతుంది. గుడ్డులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అందులోనూ పిల్లలకు ఇవ్వడం చాలా మంచిది. వారి శరీరం గ్రోత్ అవ్వడానికి చాలా పోషకాలు అవసరం అవుతాయి. గుడ్డుతో ఎన్నో రకాల వెరైటీలు మనం తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ ఒకేలా ఇస్తే పిల్లలకు కూడా బోర్ కొడుతుంది. ఒక్కసారి ఎగ్ చాట్ ట్రై చేయండి. పెద్దలకు, పిల్లలకు బాగా నచ్చుతుంది. ఇది చేయడం కూడా చాలా సులభం. ఎక్కువ సమయం పట్టదు. మరి ఈ టేస్టీ ఎగ్ చాట్‌ను ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎగ్ చాట్‌కు కావాల్సిన పదార్థాలు:
ఉడకబెట్టిన గుడ్లు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, వెల్లుల్లి తరుగు, కొత్తి మీర, ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా, ఆయిల్.
ఎగ్ చాట్ తయారీ విధానం:
ముందుగా కోడి గుడ్లను ఉడక బెట్టి పక్కన పెట్టుకోవాలి. వీటిని ముక్కలుగా కట్ చేసి.. పచ్చ సొన తీసి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేయాలి. ఇందులో పచ్చి మిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి తరుగు, టమాటా ముక్కలు కూడా వేసి ఓ రెండు నిమిషాలు వేయించాలి. ఆ నెక్ట్స్ ఉప్పు, కారం, పసుపు, మసాలా చాట్ కూడా వేసి ఓ నిమిషం పాటు వేయించాలి. ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసి కలుపాలి.
ఈ నీరు దగ్గర పడ్డాక.. కొత్తి మీర వేసి కలిపాక.. పచ్చ సొన పొడి, తెల్ల గుడ్డు ముక్కలు వేసి కలపాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఎగ్ చాట్ సిద్ధం. ఈ చాట్‌ని ఇంకా చాలా రకాలుగా తయారు చేస్తారు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది. పిల్లలకు లంచ్ బాక్సులో కూడా పెట్టి ఇవ్వొచ్చు.