వారానికి ఎంత మటన్ తింటే మంచిది? ఆరోగ్య ప్రయోజనాలు, పరిమితులు, నిపుణుల సూచనలు ఇవే!

మనదేశంలో నాన్‌వెజ్ ప్రియులు అత్యంత ఇష్టంగా తినే ఆహారాల్లో మటన్ ఒకటి. మటన్ వంటకాలు విశేషమైన రుచితో పాటు శరీరానికి అవసరమైన అనేక ముఖ్య పోషకాలను అందిస్తాయి. అయితే, మటన్ రెడ్ మీట్ కావడం వల్ల దీనిని ఎంత మోతాదులో తింటున్నామనేది చాలా ముఖ్యం. పరిమితికి మించి తింటే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మటన్ తినడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరంగా తెలుసుకుందాం.

వారానికి ఎంత మటన్ తింటే మంచిది? ఆరోగ్య ప్రయోజనాలు, పరిమితులు, నిపుణుల సూచనలు ఇవే!
How Much Mutton Per Week
Image Credit source: Tv9 marathi

Updated on: Aug 06, 2026 | 10:58 AM

మనలో చాలా మంది నాన్‌వెజ్‌ ప్రియులు ఉంటారు. వారికి ప్రతి రోజూ మటన్‌, చికెన్‌ తినడం చాలా ఇష్టం ఉంటుంది. మటన్ రుచికరమైన ఆహారమే కాకుండా శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ B12 లను పుష్కలంగా అందిస్తుంది. ఇది కండరాల దృఢత్వానికి, రక్తహీనత నివారణకు సహాయపడుతుంది. అయితే, మటన్ రెడ్ మీట్ విభాగంలోకి వస్తుంది. కాబట్టి దీనిని అతిగా తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిపుణుల సలహా ప్రకారం ఒక వ్యక్తి వారానికి ఎంత మటన్‌ తినాలి అనేది ఇప్పుడు చూద్దాం..

మటన్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

మటన్‌లో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల నిర్మాణాలు, కణజాలాల పునరుద్ధరణకు ఎంతగానో తోడ్పడుతుంది. ఇందులో ఉండే హీమ్ ఐరన్ శరీరం సులువుగా గ్రహిస్తుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి అనీమియా రాకుండా కాపాడుతుంది. మటన్‌లో విటమిన్ B12 పుష్కలంగా ఉండటం వల్ల నరాల బలహీనత తగ్గుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇందులోని జింక్, సెలీనియం వంటి ఖనిజాలు శరీర నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

లాభాలతో పాటు అతిగా తింటే కలిగే ప్రమాదాలు కూడా ఉన్నాయి:

మటన్‌లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీనిని అతిగా తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి రక్తపోటు, గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. రెడ్ మీట్ త్వరగా జీర్ణం కాదు. ఎక్కువ పరిమాణంలో తింటే కడుపు ఉబ్బరం, అజీర్తి, మలబద్ధకం ఏర్పడతాయి. మటన్‌లో ప్యూరిన్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగి గౌట్ లేదా కీళ్ల నొప్పులకు దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

అందుకే వారానికి ఎంత తినాలి?:

ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి వారానికి 200 నుండి 350 గ్రాముల మటన్ తీసుకోవచ్చు. అనగా వారానికి ఒకటి లేదా రెండుసార్లు పరిమిత మోతాదులో తీసుకోవడం శ్రేయస్కరం. ఇకపోతే, మటన్‌ను మసాలాలు, నూనె ఎక్కువగా వేసి డీప్ ఫ్రై చేయడం కంటే కూరలా లేదా సూప్ రూపంలో వండుకోవడం మంచిది. వండే ముందు మాంసానికి ఉన్న కొవ్వు భాగాన్ని వీలైనంత వరకు తొలగించాలి. మటన్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, పరిమితి దాటితే ప్రమాదకరం. గుండె సమస్యలు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వైద్యుల సలహా మేరకే దీనిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us