Mustard Oil Benefits: మార్కెట్‌లో అనేక రకాల వంటనూనెలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామందికి ఏ వంట నూనెను ఉపయోగించాలో అర్థం కాదు. నూనె గురించి ప్రకటనలల్లో చూసినా, చుట్టుపక్కల వారు ఏదైనా చెప్పినా.. మంచిదా.. కాదా..? అని ఆలోచించకుండా ఇంట్లో వంట కోసం ఉపయోగించడం ప్రారంభిస్తారు. చాలా మంది ఆహార పదార్థాలను శుద్ధి చేసిన తర్వాత తయారు చేస్తారు. ఇది ఆరోగ్య పరంగా మంచిదే. కానీ.. వంటకి మంచి వంట నూనె ఏదీ.. ఎలాంటిది వాడాలి అని తెలసుకోరు. కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆలివ్ ఆయిల్, ఆవనూనె మంచి వంట నూనెలుగా నిపుణులు పేర్కొంటారు. ఆలివ్ ఆయిల్ చాలా ఖరీదైనది కాబట్టి.. దానిని ఉపయోగించడం అందరికీ సాధ్యం కాదు. అందువల్ల ఆవనూనె ఉత్తమమైనదిగా పేర్కొంటారు. ఆవాల నూనెను ఎప్పటి నుంచో ఇళ్లలో వంటలకు ఉపయోగిస్తున్నారు. పొదుపుగా ఉండటమే కాకుండా.. వంట చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే.. ఆవనూనె వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వంటకు ఆవ నూనె బెస్ట్..
వంట చేయడానికి ఏ నూనె ఉత్తమమో దాని పొగ పాయింట్ ద్వారా నిర్ణయిస్తారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం.. ఆవాల నూనె స్మోక్ పాయింట్ 249 °C, ఇది మంచి వంట నూనె స్కోర్‌గా పరిగణిస్తారు. నూనె ద్వారా వంట ఎప్పుడు ఆపాలనేది స్మోక్ పాయింట్ నిర్ణయిస్తుంది. నూనెను స్మోక్ పాయింట్‌కు మించి వండినట్లయితే.. అది ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది
మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు మంచి కొలెస్ట్రాల్ మొత్తాన్ని పెంచడానికి పని చేస్తాయి. అలాగే కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఆవ నూనె సహాయపడుతుంది. ఆవాల నూనెలో 60% మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ కారణంగా ఈ నూనె గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు.
బరువును నియంత్రిస్తుంది
ఆవనూనెలో దాదాపు 21 శాతం పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇది వంట నూనెలో ముఖ్యమైన పోషకం. ఇది మీకు ఒమేగా -3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలను ఇస్తుంది. ఇది శరీరానికి శక్తిని, కేలరీలను అందిస్తుంది. బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
మస్టర్డ్ ఆయిల్‌లో క్యాన్సర్‌తో పోరాడే గుణాలు కూడా ఉన్నాయి. ఇందులో ఉండే లినోలిక్ యాసిడ్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లుగా మార్చబడుతుంది. ఇవి క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. ఆవనూనె శరీరంలోని క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించి.. అవి తీవ్రరూపం దాల్చకుండా నివారిస్తుందని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి.
శరీర నొప్పులు, గాయాల నుండి ఉపశమనం..
ఆవనూనెలో అల్లైల్ ఐసోథియోసైనేట్ ఉంటుంది. ఇది శరీరంలో గాయం, నొప్పిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇదే కాకుండా.. ఆవ నూనెలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మీ శరీరంలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది.
Also Read: