Gutti Dondakaya Curry: గుత్తిదొండకాయ మసాలా కూర తయారీ విధానం తెలుసుకుందాం..!

|

Apr 20, 2021 | 1:53 PM

Gutti Dondakaya Curry:ముందుకు రోజుకో రెసిపీ వచ్చే స్తున్నాం..  దొండకాయ ను గుత్తి మసాలా పెట్టి కూడా కూరగా తయారీ చేసుకోవచ్చు. ఈ రోజు గుత్తిదొండకాయ మసాలా కూర తయారీ విధానం..

Gutti Dondakaya Curry: గుత్తిదొండకాయ మసాలా కూర తయారీ విధానం తెలుసుకుందాం..!
Follow us on

Gutti Dondakaya Curry: ఎప్పుడూ రెగ్యులర్ కూరలు.. తినే వారి కోసం అవే కూరగాయలతో డిఫరెంట్ గా రుచికరంగా కూరలు తయారీ చేయడం ఎలా.. అంటూ మీ ముందుకు రోజుకో రెసిపీ వచ్చే స్తున్నాం..  దొండకాయ ను గుత్తి మసాలా పెట్టి కూడా కూరగా తయారీ చేసుకోవచ్చు. ఈ రోజు గుత్తిదొండకాయ మసాలా కూర తయారీ విధానం తెలుసుకుందాం..!

దొండ‌కాయ మ‌సాలా కూరకి కావల్సిన పదార్ధాలు:

దొండకాయలు – పావుకేజీ,
పల్లీలు – అరకప్పు,
నువ్వులు – పావుకప్పు,
ధనియాలు – రెండు చెంచాలు,
ఎండుమిర్చి – పది,
అల్లంవెల్లుల్లి
ఉప్పు రుచికి సరిపడా
ఉల్లిపాయ – ఒకటి,
టొమాటోలు – రెండు,
నూనె – పావుకప్పు.

తయారీ విధానం :

దొండకాయలను నాలుగుభాగాలుగా చీలుస్తూ.. గుత్తొంకాయ తరహాలో తరిగి ఉడికించి పెట్టుకోవాలి. బాణలిలో చెంచా నూనె వేడిచేసి పల్లీలూ, నువ్వులూ, ధనియాలూ, ఎండుమిర్చీ, అల్లంవెల్లుల్లి తరుగూ, ఉల్లిపాయా, టొమాటో ముక్కలూ వేయించుకుని తీసుకోవాలి. వేడి చల్లారాకా తగినంత ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో మిగిలిన నూనె వేడిచేసి ఉడికించిన దొండకాయ ముక్కలు వేయాలి. అవి కాస్త వేగాక ముందుగా చేసుకున్న మసాలా వేసి మంటతగ్గించి సిమ్ లో పెట్టాలి. కాసేపటికి ఇది కూరలా తయారవుతుంది. అప్పుడు దింపేయాలి.

ఇది అన్నంలోకి రొట్టెల్లోకి చాలా బాగుటుంది.

Also Read: చిత్ర పరిశ్రమలో ఆగని కరోనా కల్లోలం..బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ ఆరోగ్య పరిస్థితి విషమం..