Punarnava Dal: ఇది కూర కాదు.. ఒంట్లో పార్ట్స్ అన్నీ రిపేర్ చేసే సంజీవని.. ఎలా వండాలో తెలుసా?

Galijeru Pappu Recipe: మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఎన్నో అద్భుతమైన ఔషధ మొక్కలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది 'గలిజేరు'. దీనినే పునర్నవ అని కూడా అంటారు. పూర్వకాలం నుంచి మన పెద్దలు ఈ ఆకును ఆహారంగా తీసుకునేవారు. అయితే, నేటి తరానికి ఈ మొక్క విలువ తెలియక దీనిని ఒక కలుపు మొక్కలా చూస్తున్నారు. కానీ, ఈ గలిజేరు ఆకు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలిస్తే మీరు అస్సలు వదలరు.

Punarnava Dal: ఇది కూర కాదు.. ఒంట్లో పార్ట్స్ అన్నీ రిపేర్ చేసే సంజీవని.. ఎలా వండాలో తెలుసా?
Galijeru Pappu Recipe

Updated on: Apr 28, 2026 | 4:36 PM

Punarnava Benefits: ఆధునిక జీవనశైలిలో మనం తినే జంక్ ఫుడ్ వల్ల మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలైన కాలేయం (Liver), మూత్రపిండాలు (Kidneys), గుండె క్రమంగా షెడ్డుకు చేరుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన అంతర్గత అవయవాలను శుభ్రం చేసి, వాటికి పునర్జీవం పోయడంలో పేరుగాంచిన ఓ మొక్క ఉందని మీకు తెలుసా? ఇది మన ఒంట్లోని అవయవాలను రిపేర్ చేసి కలకాలం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మన పెద్దలు కూడా దీనిని తినేవారు. అదే గలిజేరు ఆకు. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే దీనికి ‘పునర్నవ’ అనే పేరు వచ్చింది.

గలిజేరు ఆకు అంటే ఏమిటి? ఎక్కడ దొరుకుతుంది?

గలిజేరు ఆకు అనేది పొలాల గట్ల మీద, బీడు భూముల్లో విరివిగా దొరుకుతుంది. ఇది చూడటానికి చిన్న ఆకులతో పాదులాగా నేలపై పాకుతూ ఉంటుంది. దీని పువ్వులు చిన్నగా పింక్ లేదా తెలుపు రంగులో ఉంటాయి. పల్లెటూర్లలో ఇది చాలా సులభంగా దొరుకుతుంది. నగరాల్లో ఉండేవారు ఆకుకూరలు అమ్మే వారి దగ్గర దీని గురించి అడిగితే తెచ్చిస్తారు.

గలిజేరు ఆకు పప్పు తయారీ విధానం..

గలిజేరు ఆకును నేరుగా తినడం కంటే పప్పులో వేసుకుని వండుకుంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.

కావలసిన పదార్థాలు:

కందిపప్పు – ఒక కప్పు

గలిజేరు ఆకు – రెండు కట్టలు

ఉల్లిపాయ, పచ్చిమిర్చి

కారం, పసుపు, ఉప్పు

తాలింపు గింజలు (ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి)

ఇంగువ (రుచి కోసం)

తయారీ విధానం:

ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి.

గలిజేరు ఆకును కాడల నుంచి వేరు చేసి, ఉప్పు నీటిలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి (పొలాల్లో దొరుకుతుంది కాబట్టి మట్టి ఉండే అవకాశం ఉంది).

ఒక కుక్కర్‌లో లేదా మట్టి పాత్రలో నానబెట్టిన పప్పు, గలిజేరు ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కారం, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి.

పప్పు బాగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి.

చివరగా నూనెలో తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి తాలింపు పెట్టుకుంటే ఎంతో రుచికరమైన ‘గలిజేరు ఆకు పప్పు’ సిద్ధం.

ఆరోగ్య ప్రయోజనాలు..

కిడ్నీ సమస్యలు: మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారికి ఇది దివ్యౌషధం. శరీరంలోని విషతుల్యాలను (Toxins) బయటకు పంపి కిడ్నీలను శుభ్రం చేస్తుంది.

లివర్ ఆరోగ్యం: కాలేయానికి సంబంధించిన సమస్యలను తగ్గించి, లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది.

షుగర్, బీపీ: రక్తపోటును, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి ఈ ఆకు ఎంతగానో దోహదపడుతుంది.

కంటి చూపు: క్రమం తప్పకుండా ఈ ఆకుకూర తింటే కంటి చూపు మెరుగుపడుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us