Watch: మొదటి దోశ అంటుకుపోతుందా? డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశల కోసం సింపుల్ కిచెన్ టిప్స్!

దోశ అనేది మన దేశంలో ముఖ్యంగా దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ పొందిన మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్. కానీ, చాలా మందికి ఇంట్లో దోశలు వేసేటప్పుడు అవి హోటల్‌లో లాగా క్రిస్పీగా రావు. ఒక్కోసారి పెనానికి అంటుకుపోవడం లేదా మెత్తగా అయిపోవడం జరుగుతుంది. పర్ఫెక్ట్, గోల్డెన్ బ్రౌన్ కలర్ క్రిస్పీ దోశలను ఇంట్లోనే సులభంగా తయారు చేయడానికి కొన్ని ముఖ్యమైన కిచెన్ టిప్స్ ఇక్కడ ఉన్నాయి.

Watch: మొదటి దోశ అంటుకుపోతుందా? డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశల కోసం సింపుల్ కిచెన్ టిప్స్!
Hotel Style Dosa
Image Credit source: facebook

Updated on: Jun 12, 2026 | 7:17 AM

దోసె దాదాపు అందరికీ ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌. అందుకే చాలా మంది అల్పాహారంగా వేడివేడి దోసెలు వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ, ఉదయం హడావిడిలో దోసె వేయడానికి ప్రయత్నించినప్పుడు, మొదట వేసిన దోసె పెనానికి అంటుకుపోయి, ఆ తర్వాత ఊడి రాదు. మీరు పెనాన్ని తలక్రిందులుగా తిప్పి గరిటతో బలంగా రుద్దుతూ యుద్ధం చేయాల్సి వస్తుంది. దీంతో మీ సమయం కూడా వృధా అవుతుంది. చివరకు చిరాకుతో దోసె వేయాలన్న ఇంట్రెస్ట్‌ కూడా పోతుంది. చాలా మందికి ఎప్పుడూ ఈ సమస్య ఉంటుంది. అందుకే ఇప్పుడు కింద పేర్కొన్న ఒక ప్రత్యేక చిట్కాను ట్రై చూడండి. మీరు ఆ విధంగా దోసె వేయడానికి ప్రయత్నిస్తే, అది ఖచ్చితంగా అంటుకోదు. అదేలాగంటే…

మృదువుగా, క్రిస్పీగా ఉండే పర్ఫెక్ట్ దోశలను ఇంట్లోనే తయారు చేయడం ఎలాగో ఇక్కడ కొన్ని సులువైన చిట్కాల ద్వారా తెలుసుకుందాం. ఇలాంటి చిన్న చిట్కాలను పాటిస్తే మీ ఇంట్లో కూడా హోటల్ రుచితో కూడిన దోశలను సులభంగా తయారు చేసుకోవచ్చు. దోశలు సరిగ్గా రావడానికి కేవలం పిండి రుబ్బడం మాత్రమే కాదు, బియ్యం, మినప్పప్పు నిష్పత్తి, పెనం ఉష్ణోగ్రత కూడా చాలా ముఖ్యం. సాధారణంగా 3 కప్పుల బియ్యానికి 1 కప్పు మినప్పప్పును ఉపయోగించాలి. వీటితో పాటు ఒక చెంచా మెంతులు, పావు కప్పు అటుకులు నానబెట్టడం వల్ల దోశలకు మంచి క్రిస్పీనెస్, గోల్డెన్ కలర్ వస్తుంది.

ఇవి కూడా చదవండి

ముందుగా బియ్యం, పప్పులను బాగా కడిగి 5-6 గంటలు నానబెట్టిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని కనీసం 7 నుండి 8 గంటల పాటు లేదా రాత్రంతా వెచ్చని ప్రదేశంలో పులియబెట్టాలి పిండి సరిగ్గా పులిస్తేనే దోశలు తేలికగా, రుచిగా వస్తాయి. ఇక దోశ వేసేటప్పుడు, ముందుగా దోసె వేయడానికి వాడే పెనాన్ని గ్యాస్ మీద వేడి చేయండి. పెనం బాగా వేడెక్కాక, దానిపై కాస్త ఉప్పు చల్లండి.. తర్వాత ఒక ఐస్ ముక్కను తీసుకుని వేడిగా ఉన్న పెనం మీద వెడల్పుగా రుద్దాలి. ఇప్పుడు, ఆ ఐస్‌ నీరు పెనం మీద కాస్త ఉడిగినట్టుగా అవగానే తీసేయాలి. తర్వాత, పెనాన్ని తిరిగి గ్యాస్ మీద పెట్టి వేడెక్కనివ్వండి. పాత్ర మీద కొన్ని నీటి చుక్కలు ఉన్నప్పుడు మాత్రమే, సగం కోసిన ఉల్లిపాయను నూనెలో ముంచి, పాన్ అంతా నూనె పట్టేలా సరిగ్గా తిప్పండి. ఇప్పుడు గ్యాస్‌ను తక్కువ మంట మీద పెట్టి, దోసె పిండిని పెనం మధ్యలో పోయండి. పెనం మీద దోసె పిండి పోసే ప్రతిసారీ గ్యాస్ తక్కువగా ఉండాలి. ఎందుకంటే పెనం మరీ వేడిగా ఉంటే, దోసె తప్పకుండా పెనానికి అంటుకుని పాడైపోతుంది.

అలాగే, మొదటి దోసె కొంచెం మందంగా ఉండాలి. దీని తర్వాత, దోసెను తీసేటప్పుడు, ముందుగా గరిటెను చల్లటి నీటిలో ముంచి, ఆ తర్వాత దోసెను పెనం నుండి తీయాలి. పెనం మధ్యలో ఒక గరిటెడు పిండిని వేసి, లోపలి నుండి బయటి వైపుకు వృత్తాకారంలో వేగంగా తిప్పాలి. దోశ వేసిన తర్వాత మాత్రమే మంటను మీడియం లేదా హై ఫ్లేమ్‌లో పెట్టాలి. వెంటనే చుట్టూ కొద్దిగా నూనె లేదా నెయ్యి రాయడం వల్ల దోశ క్రిస్పీగా మారుతుంది. ఈ విధంగా దోసె వేస్తే, అది పెనానికి అంటుకోదు.

వీడియో ఇక్కడ చూడండి..

దోశ పిండిని ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే, వేసే ముందు కనీసం అరగంట ముందే బయటకు తీసి గది ఉష్ణోగ్రతకు వచ్చేలా చూడాలి. చల్లటి పిండితో దోశలు వేస్తే అవి సరిగ్గా కాలవు. ఈ సింపుల్ కిచెన్ ట్రిక్స్ పాటిస్తే, మీ ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ ఇష్టపడే పర్ఫెక్ట్ క్రిస్పీ దోశలను నిమిషాల్లో సిద్ధం చేయవచ్చు! ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us