AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dry Seeds Laddu : కీళ్ల నొప్పులు మాయం, జుట్టు రాలడానికి చెక్.. పంచదార లేని ఎనర్జీ లడ్డూలివి..

చర్మ సౌందర్యం అనగానే మనలో చాలా మంది మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన క్రీములు, ఫేస్ ప్యాక్‌ల వైపు మొగ్గు చూపుతారు. కానీ, నిజమైన అందం మరియు ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం నుంచే మొదలవుతాయి. కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఇటీవల ఒక వినూత్నమైన, అత్యంత పోషక విలువలు కలిగిన 'డ్రై సీడ్స్ లడ్డు' స్థానిక మహిళల బ్యూటీ ఫార్ములాగా రోగనిరోధక శక్తిని పెంచే సంజీవనిలా విపరీతమైన ప్రజాదరణ పొందుతోంది.

Dry Seeds Laddu : కీళ్ల నొప్పులు మాయం, జుట్టు రాలడానికి చెక్.. పంచదార లేని ఎనర్జీ లడ్డూలివి..
Dry Seeds Laddu Benefits
Bhavani
|

Updated on: Jul 17, 2026 | 8:17 PM

Share

కేవలం చర్మాన్ని మిలమిలలాడేలా చేయడమే కాకుండా.. రక్తహీనత, మోకాళ్ల నొప్పులు, జుట్టు రాలడం మరియు శారీరక బలహీనతతో బాధపడేవారికి ఇది ఒక అద్భుతమైన ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది. ఎలాంటి పంచదార లేదా బెల్లం పాకం లేకుండా పూర్తి సహజంగా తయారు చేసుకునే ఈ మ్యాజికల్ లడ్డు తయారీ విధానం మరియు ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. లడ్డు తయారీకి కావలసిన ప్రధాన పదార్థాలు:

గుమ్మడి గింజలు , పొద్దుతిరుగుడు గింజలు , తర్బూజా గింజలు , అవిసె గింజలు , నువ్వులు.

తీపి మరియు బైండింగ్ కోసం ముదురు రంగు ఎండు ఖర్జూరాలు, ఎండుద్రాక్ష మరియు కొద్దిగా నెయ్యి.

2. తయారీ విధానం

గింజలను వేయించడం: మొదట ఒక కడాయిలో నూనె లేదా నెయ్యి లేకుండా పైన పేర్కొన్న అన్ని రకాల గింజలను విడివిడిగా దోరగా, తక్కువ మంటపై వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కాస్త బరకగా పొడి చేసుకోవాలి.

ఖర్జూర పేస్ట్ సిద్ధం చేయడం: గింజలు తీసివేసిన గింజల లేని మెత్తని ఖర్జూరాలను కొద్దిగా నెయ్యి వేసి మిక్సీలో గ్రైండ్ చేసి సాఫ్ట్ పేస్ట్‌లా చేసుకోవాలి.

లడ్డు చుట్టడం: ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో గ్రైండ్ చేసిన గింజల పొడి, ఖర్జూర పేస్ట్ మరియు కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా కలపాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డులుగా చుట్టుకోవాలి. కావాలనుకుంటే ఇందులో వేయించిన జీడిపప్పు, బాదం ముక్కలను కూడా కలుపుకోవచ్చు.

3. ఈ లడ్డు వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు:

గ్లోయింగ్ స్కిన్ : ఈ లడ్డులో వాడే గుమ్మడి, పొద్దుతిరుగుడు గింజలలో విటమిన్-ఇ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను లోపలి నుండి శుద్ధి చేసి, ముఖంపై ముడతలు పడకుండా నిరోధించి చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తాయి.

జుట్టు ఎదుగుదల : ఇందులోని జింక్, ఐరన్ నువ్వులలో ఉండే కాల్షియం జుట్టు వేరులను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని అరికడతాయి.

అపరిమితమైన శక్తి: రోజంతా నీరసంగా ఉండే అలసటను దూరం చేసి, ఇన్స్టెంట్ ఎనర్జీని అందిస్తుంది. ముఖ్యంగా పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు ఇది ఒక అద్భుతమైన పోషకాహారం.

హార్మోన్ల సమతుల్యత: మహిళల్లో వచ్చే పీరియడ్స్ సమస్యలను థైరాయిడ్ వంటి హార్మోన్ల హెచ్చుతగ్గులను అదుపులో ఉంచడానికి ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తోడ్పడతాయి.

ప్రతిరోజూ ఉదయాన్నే లేదా సాయంత్రం స్నాక్స్ సమయంలో ఒక్క డ్రై సీడ్స్ లడ్డు తింటే చాలు, మీ శరీరానికి అవసరమైన రోజువారీ పోషకాలన్నీ సులభంగా అందుతాయి.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. పైన పేర్కొన్న వివరాలు సాధారణ పోషకాహార నిపుణుల సలహాలు మరియు స్థానిక సాంప్రదాయ ఆహార పద్ధతుల ప్రాతిపదికన అవగాహన కోసం మాత్రమే అందించబడ్డాయి, దీనికి సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు. గింజలలో సహజసిద్ధమైన వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు లడ్డుల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఏదైనా నిర్దిష్ట అలర్జీలు ఉన్నవారు డైటీషియన్‌ను సంప్రదించి దీనిని డైట్‌లో చేర్చుకోవడం శ్రేయస్కరం.

Follow Us
ఈ లడ్డు రోజుకోటి తింటే మీ చర్మం మెరిసిపోవడం ఖాయం!
ఈ లడ్డు రోజుకోటి తింటే మీ చర్మం మెరిసిపోవడం ఖాయం!
ఇలా ఇంట్లో కోడి బిర్యానీ చేస్తే బయటవి టచ్ కూడా చెయ్యరు..
ఇలా ఇంట్లో కోడి బిర్యానీ చేస్తే బయటవి టచ్ కూడా చెయ్యరు..
డయాబెటిస్ ఉన్నవారు రోజూ పాలు, పంచదార టీ తాగవచ్చా? డాక్టర్ల సూచన
డయాబెటిస్ ఉన్నవారు రోజూ పాలు, పంచదార టీ తాగవచ్చా? డాక్టర్ల సూచన
ఈ టాలీవుడ్ హీరోయిన్ శ్రీనివాస రామానుజన్‌కు ముని మనవరాలుఅవుతుందా?
ఈ టాలీవుడ్ హీరోయిన్ శ్రీనివాస రామానుజన్‌కు ముని మనవరాలుఅవుతుందా?
ఆషాఢ మాసంలో పెళ్లీలు ఎందుకు చేయరో తెలుసా?దీని వెనకున్న రహస్యం ఇదే
ఆషాఢ మాసంలో పెళ్లీలు ఎందుకు చేయరో తెలుసా?దీని వెనకున్న రహస్యం ఇదే
రోహిత్ రిటైర్మెంట్‌పై ఆకాష్ చోప్రా భావోద్వేగ కామెంట్స్
రోహిత్ రిటైర్మెంట్‌పై ఆకాష్ చోప్రా భావోద్వేగ కామెంట్స్
అమెరికా స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్!
అమెరికా స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్!
రాత్రి పూట ఈ నీటిని తాగితే మరుసటి రోజు ఉదయం మలబద్ధకం మాయం!
రాత్రి పూట ఈ నీటిని తాగితే మరుసటి రోజు ఉదయం మలబద్ధకం మాయం!
వీళ్లు కాలికి నల్లదారం కట్టుకుంటే ప్రమాదం!
వీళ్లు కాలికి నల్లదారం కట్టుకుంటే ప్రమాదం!
కొత్తిమీరను కట్టలుగా కట్టి మాత్రమే ఎందుకు అమ్ముతారో తెలుసా?
కొత్తిమీరను కట్టలుగా కట్టి మాత్రమే ఎందుకు అమ్ముతారో తెలుసా?