Diversified Diets: పిల్లల్లో ప్రోటీన్ సమస్యకు న్యూట్రీషియన్స్ కీలక సూచనలు.. అది తప్పనిసరి చేయాలంటూ..

Diversified Diets: భారతదేశంలో ఆహారానికి కొదవే లేదు. అయితే, దేశ ప్రజలు తినే ఆహారంలో పోషకాల లేమి మాత్రం ఉంది. ఆ పోషకాల లేమి కారణంగానే ప్రజలు అనేక ఇబ్బందులు..

Diversified Diets: పిల్లల్లో ప్రోటీన్ సమస్యకు న్యూట్రీషియన్స్ కీలక సూచనలు.. అది తప్పనిసరి చేయాలంటూ..
Nutrition
Follow us

|

Updated on: May 27, 2022 | 5:50 PM

Diversified Diets: భారతదేశంలో ఆహారానికి కొదవే లేదు. అయితే, దేశ ప్రజలు తినే ఆహారంలో పోషకాల లేమి మాత్రం ఉంది. ఆ పోషకాల లేమి కారణంగానే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా దేశంలో అధిక సంఖ్యలో పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పోషకాహారలపై ప్రజల్లో సరైన అవగాహన లేక.. పిల్లలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో పోషకాహారా లోపంపై అనేక అధ్యయన సంస్థలు పరిశోధనలు చేశాయి. ఆ పరిశోధనల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అనేక అధ్యయనాల ప్రకారం.. దేశంలో 2014-15లో ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అనే భయంకరమైన వ్యాధి కారణంగా దేశంలో 37% చిన్నారులు కుంగిపోయారు. 21% మంది నిస్సత్తువగా ఉన్నారు. 34% మంది తక్కువ బరువుతో బాధపడుతున్నారు. దురదృష్టవశాత్తు, ప్రస్తుత పాండమిక్ పరిస్థితుల్లో ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతోందని అనేక పోషకాహార నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో చాలా మంది బియ్యం, గోదుమలనే ఆహారంగా తీసుకుంటారు. అయితే, చేసే పనికి అవసరమైన ఇతర పోషకాలను తీసుకోవాలనే ఆలోచన లేదనే చెబుతున్నారు పోషకాహార నిపుణులు. నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బోర్డ్ చేసిన సర్వేలో.. భారతీయుల ఆహారంలో దాదాపు 60% ప్రొటీన్‌లు తృణధాన్యాల నుంచి లభిస్తుందని వెల్లడించారు. అయితే, ప్రజలు మాత్రం బియ్యం, గోదుమలపై ఎక్కువగా ఆధార పడటం వలన ప్రోటీన్స్ లేమితో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

కాగా, ప్రస్తుత కాలంలో బియ్యం, గోదుమలు సహా రోటీన్ ఫుడ్ కాకుండా.. అధిక ప్రోటీన్స్ కలిగిన ఫోర్టిఫైడ్ ఫుడ్స్ కూడా మార్కెట్‌లోకి వస్తున్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని, పోషకాహార లోపం సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని చెబుతున్నారు నిపుణులు. దేశంలో పెద్దలు, పిల్లల్లో పోషకాహార లోపంపై నిపుణులు ఏం చెబుతున్నారు? వారి అభిప్రాయాలేంటో ఒకసారి చూద్దాం..

‘‘దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం చాలా ఎక్కువగా ఉంది. ఆహారం నాణ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి దేశంలో మిషన్ మోడ్ విద్యా కార్యక్రమం ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మనం తినే ఆహారాల నాణ్యతను పెంచడం, మినుములు, పప్పులు వంటి వైవిధ్యభరితమైన, పోషకాలు కలిగిన ఆహారాలను తినడం చాలా అవసరం.’’ అని ICAR-నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, ICAR మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ KC బన్సాల్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

అయితే, స్కూల్ వయసు పిల్లలలో ఇటువంటి పోషకాహార లోపాలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం 2001లో అన్ని రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల్లోని పిల్లలకు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనంలో తాజాగా వండిన, పౌష్టికాహారాన్ని అందజేయడం జరుగుతుంది. వడ్డించే భోజనంలో ప్రోటీన్ నాణ్యతను పెంపొందించడానికి ‘పీఎం పోషన్’ పథకం కింద మధ్యాహ్న భోజనంలో మినుములను చేర్చాలని ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రా, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. కాగా, మొక్కల ఆధారిత ప్రోటీన్ ప్రత్యామ్నాయాలు, సోయా ప్రోటీన్ పిల్లలకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం వంటి ప్రభుత్వ కార్యక్రమాలలో ఈ ఉత్పత్తులను ప్రభుత్వం చేర్చాలని దేశంలోని ఆహార శాస్త్రవేత్తలు చాలా సంవత్సరాలుగా సిఫార్సు చేస్తున్నారు.

“సోయా నగ్గెట్స్ వంటి ఉత్పత్తులను, మొక్కల ద్వారా లభించే మాంసాకృతులను.. నాన్‌వెజ్ మించిపోయింది. ప్రజలు మటన్, చికెన్‌కు బాగా అలవాడు పడ్డారు. అయితే, వాటికంటే మొక్కల రూపంలో లభించే మాంసాకృతులు శరీరానికి మంచి పోషకాలను అందిస్తాయి. సరైన రుచితో, సరైన ధరకు ప్రోటీన్‌ను లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే పిల్లలకు అవసరమైన పోషక పదార్థాలను మధ్యాహ్నం భోజనంలో అందించడం జరుగుతుంది.’’ అని గుడ్ ఫుడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ దేశ్ పాండే తెలిపారు.

కేవలం పాఠశాలల్లోనే కాదు, ఇంట్లో కూడా పిల్లల విలక్షణమైన ఆహారం వారి సమగ్ర అభివృద్ధికి అవసరమైన సరైన పోషకాహారం, ప్రోటీన్ తీసుకోవడం తక్కువగా ఉంటుంది. దేశ్‌పాండే ప్రకారం.. ఆహార శాస్త్రంలో అధిక స్థాయి ప్రోటీన్‌లతో అన్నం, చపాతీ మొదలైన ప్రధాన ఆహారాన్ని బలపరిచే పద్ధతుల్లో గణనీయమైన పురోగతిని సాధించింది. మాంసం, గుడ్లు, పాలు వంటి సాధారణ వనరులను ఆహారాలను పక్కన పెడితే, మాక్ మీట్‌లు కూడా శాకాహార గృహాలలో సులభంగా వినియోగించబడే మంచి ప్రత్యామ్నాయాలు.

నటి, సెలబ్రిటీ ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు మందిరా బేడీ కూడా ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి మాక్ మీట్, సోయాబీన్ ప్రాముఖ్యతను అంగీకరించారు. “నాకు ప్రతిరోజూ కనీసం 20-30 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఇంతకు ముందు గుడ్లు, చీజ్ మాత్రమే తినడానికి ఎంపిక చేసుకున్నాడు. కానీ, ఇప్పుడు నా ప్రాధాన్యత మారింది. అధిక ప్రోటీన్స్ కలిగిన మాక్ మీట్, సోయాను ఎంచుకున్నాను.’’ అని చెప్పుకొచ్చారు.

‘‘జంతు ఉత్పత్తులకు మంచి ప్రత్యామ్నాయాలు అయిన ప్రోటీన్-ఫోర్టిఫైడ్ ఫుడ్స్ గురించి శాఖాహార కుటుంబాలలో అవగాహన కల్పించడం చాలా కీలకం. ఇది పిల్లలలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడంలో సహాయపడుతుంది. అధిక పోషక విలువలు కలిగిన, మంచి రుచి, అందుబాటు ధరలో లభించే ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి వీలుగా ఫుడ్ సైన్స్‌ని ఏకతాటిపైకి తీసుకురావడం సమాజం, పరిశ్రమలు, ప్రభుత్వం బాధ్యత. ఇంట్లో ఆహారపు అలవాట్లు సమతుల్యంగా ఉండేలా చూసుకోవడానికి కుటుంబాలు కొత్త ప్రొటీన్ల గురించి కూడా అవగాహన చేసుకోవాలి’’ అని దేశ్‌పాండే అభిప్రాయపడ్డారు.

సుప్రసిద్ధ పోషకాహార ఎవాంజెలిస్ట్, వన్ హెల్త్ ప్లాట్‌ఫారమ్‌ల స్థాపకుడు డాక్టర్ శిఖా శర్మ.. తృణధాన్యాలు, వివిధ రకాల కూరగాయలతో కూడిన డైవర్సిఫైడ్ డైట్‌లను సూచిస్తున్నారు. ప్రజలు ప్రతిరోజూ వేర్వేరు కూరగాయలను తినడానికి ప్రయత్నించాలని సూచించారు. పొద్దుతిరుగుడు, నెయ్యి, ఆవాల నూనె వంటి వివిధ వంట నూనెలను ఉపయోగించాలన్నారు. దోసకాయ, క్యారెట్ మొదలైన సలాడ్‌లను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం అని పేర్కొన్నారు.

‘‘ఆహార విద్యను పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చాలి. ఇది వారి జీవితంలో మొదటి నుండి మంచి ఆహారపు అలవాట్లను నేర్పడంలో సహాయపడుతుంది.’’ అని డాక్టర్ శర్మ చెప్పుకొచ్చారు.