Coconut Puri: శీతాలకాలంలో నోరూరించే కొబ్బరి పూరీని ట్రై చేయండి.. ఎలా తయారు చేయాలో తెలుసా..

|

Dec 15, 2021 | 9:47 PM

చల్లని వాతావరణంలో ఉదయం లేదా సాయంత్రం పూరీ తినడంలో ఉండే ఆ సరదా వేరు. పూరీలు చాలా రకాలుగా తయారు చేయవచ్చు. కొంత వెరైటీ కోసం..

Coconut Puri: శీతాలకాలంలో నోరూరించే కొబ్బరి పూరీని ట్రై చేయండి.. ఎలా తయారు చేయాలో తెలుసా..
Coconut Puri
Follow us on

చల్లని వాతావరణంలో ఉదయం లేదా సాయంత్రం పూరీ తినడంలో ఉండే ఆ సరదా వేరు. పూరీలు చాలా రకాలుగా తయారు చేయవచ్చు. కొంత వెరైటీ కోసం కొబ్బరి పూరీలు ట్రై చేయవచ్చు. అసలు మీరు ఈ కొబ్బరి పూరీల గురించి ఎప్పుడైనా విన్నారా? సాధారణ పూరీ కంటే కొబ్బరి పూరీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే, దీన్ని తయారు చేయడం చాలా కష్టమైన పని కాదు. ఈ రోజు మనం కొబ్బరి పూరీ తయారీ గురించి తెలుసుకుందాం.

కొబ్బరి పూరీ అవసరమైనవి..
2 కప్పుల పిండి
2 స్పూన్ కొబ్బరి పొడి
1/4 tsp యాలకుల పొడి
అర కప్పు చక్కెర
2 స్పూన్ నెయ్యి
వేయించడానికి అవసరమైన నూనె
కొబ్బరి పూరీ ఎలా తయారు చేయాలి..
ముందుగా పిండి, ఏలకుల పొడి, కొబ్బరి, నెయ్యి  బాగా కలపాలి.
– ఒక గిన్నెలో కొద్దిపాటి చెక్కర తీసుకుని నీరును కలపండి..

–  పిండిని మంచిగా కలపాలి.

– కొద్దిగా నూనె కలిపి పిండిని సుమారు 15 నిమిషాలు పక్కన పెట్టండి.

– కాల్చడానికి మీడియం వేడి మీద పాన్‌లో నూనె పోయండి.

– ఇప్పుడు పాన్‌లో లాటించిన పూరీలను వేయండి

– లేత గోధుమరంగులోకి మారిన తర్వాత బయటకు తీయండి.

– ఇది మీరు కోరుకునే కొబ్బరి పూరీ రెడీ. మీరు ఇప్పుడు తినవచ్చు.

ఇవి కూడా చదవండి: Cow: ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన గోమాత.. రైతు ఇంట్లో పండుగ శోభ..

Aryan Khan: ఆర్యన్‌ ఖాన్‌కు మరింత ఊరట.. ఆ అవసరం లేదన్న బాంబే హైకోర్టు..