AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Sukka Recipe: చుక్క నీరు కూడా లేకుండా నోరూరించే ‘చికెన్ సుక్కా’.. వండితే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!

ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులకు పండగే. అందులోనూ చికెన్‌తో రకరకాల వంటకాలు వండుకుని ఆస్వాదించడం మనకు అలవాటు. సాధారణంగా చికెన్ కర్రీ లేదా ఫ్రై చేసేటప్పుడు ముక్క ఉడకడం కోసం చాలా మంది నీళ్లు పోస్తుంటారు. కానీ, కర్ణాటక కోస్తా తీరప్రాంతమైన మంగళూరులో అత్యంత ప్రసిద్ధి చెందిన 'చికెన్ సుక్కా' వండేటప్పుడు అసలు చుక్క నీరు కూడా ఉపయోగించరు.

Chicken Sukka Recipe: చుక్క నీరు కూడా లేకుండా నోరూరించే 'చికెన్ సుక్కా'.. వండితే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
Easy Chicken Sukka Recipe
Bhavani
|

Updated on: Jul 17, 2026 | 4:42 PM

Share

నీళ్లు పోయకుండానే చికెన్ ముక్కల్లో ఉండే సహజమైన నీరు ప్రత్యేకంగా దంచిన మసాలాల ఘాటుతో ఈ వంటకాన్ని అద్భుతంగా తయారు చేస్తారు. అన్నంలోకి సైడ్ డిష్‌గా లేదా రోటీ, చపాతీల్లోకి స్టార్టర్‌గా ఈ చికెన్ సుక్కా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మరి ముక్క నోట్లో వేస్తే కరిగిపోయేలా, ఎంతో రుచికరమైన ఈ స్పెషల్ చికెన్ సుక్కాను ఇంట్లోనే సులభంగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

1. కావలసిన ప్రధాన పదార్థాలు:

చికెన్ (అర కిలో), సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటో ముక్కలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు.

స్పెషల్ సుక్కా మసాలా కోసం: ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు, గసగసాలు పచ్చి కొబ్బరి తురుము.

2. ప్రత్యేక మసాలా పొడి తయారీ:

ముందుగా బాండీలో నూనె లేకుండా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు, లవంగాలు, దాల్చిన చెక్కను దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సీలో పచ్చి కొబ్బరి తురుము వేసి కేవలం ఒక్క రౌండ్ మాత్రమే తిప్పాలి (కొబ్బరి మరీ పేస్ట్‌లా కాకుండా కాస్త బరకగా ఉండాలి).

3. నీరు లేకుండా వండే పద్ధతి కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.

ఆ తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయాక, టమోటో ముక్కలు వేసి మెత్తగా మగ్గనివ్వాలి.

ఇప్పుడు శుభ్రం చేసిన చికెన్ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది.. చికెన్ వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టేయాలి. చికెన్ ముక్కల నుండి సహజంగానే నీరు బయటకు వస్తుంది. ఆ నీటితోనే చికెన్ 80 శాతం వరకు ఉడికిపోతుంది. విడిగా నీళ్లు పోయాల్సిన అవసరం అస్సలు లేదు.

4. ముగింపు దశ:

చికెన్ లోని నీరంతా ఇంకిపోయి ముక్క ఉడికిన తర్వాత, మనం ముందుగా సిద్ధం చేసుకున్న స్పెషల్ సుక్కా మసాలా పొడిని, కొబ్బరి తురుమును వేసి బాగా కలపాలి. మసాలాలన్నీ ముక్కకు పట్టేలా సిమ్ లో ఉంచి మరో 5 నుండి 7 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని దించుకుంటే గుమగుమలాడే మంగళూరు స్టైల్ చికెన్ సుక్కా రెడీ.

ఈ పద్ధతిలో చికెన్ వండటం వల్ల మసాలాల ఫ్లేవర్ ముక్క లోపలి వరకు వెళ్లి, చికెన్ డ్రైగా ఉన్నప్పటికీ తింటుంటే ఎంతో జ్యుసీగా రుచిగా అనిపిస్తుంది.

Follow Us
సీతాఫలం ఆకుల్లో సూపర్ మ్యాటర్.. ఆ రోగాలను తరిమికొట్టే దివ్యౌషధం!
సీతాఫలం ఆకుల్లో సూపర్ మ్యాటర్.. ఆ రోగాలను తరిమికొట్టే దివ్యౌషధం!
నదీ తీరంలోనే అంత్యక్రియలు ఎందుకు చేస్తారు? హిందూ సంప్రదాయంలో అసలు
నదీ తీరంలోనే అంత్యక్రియలు ఎందుకు చేస్తారు? హిందూ సంప్రదాయంలో అసలు
ఆసియా కప్‌ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఆసియా కప్‌ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
అకౌంట్ నుంచి కట్ అయినా ఏటీఎం నుంచి నగదు రాలేదా..?
అకౌంట్ నుంచి కట్ అయినా ఏటీఎం నుంచి నగదు రాలేదా..?
జైలులో ఉండాల్సిన ఖైదీలు ఇంట్లో.. జైలర్ మాత్రం జైలులో..!
జైలులో ఉండాల్సిన ఖైదీలు ఇంట్లో.. జైలర్ మాత్రం జైలులో..!
ఇంట్లో కిటికీల విషయంలో ఈ తప్పులు చేయకండి.. నెగిటివిటీ పెరుగుతుందట
ఇంట్లో కిటికీల విషయంలో ఈ తప్పులు చేయకండి.. నెగిటివిటీ పెరుగుతుందట
సుత్తితో దాడికి ప్రయత్నించారు.. JNTU వీసీపై పోలీసులకు ఫిర్యాదు
సుత్తితో దాడికి ప్రయత్నించారు.. JNTU వీసీపై పోలీసులకు ఫిర్యాదు
పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదుల ముష్టియుద్ధం!
పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదుల ముష్టియుద్ధం!
అమావాస్య రోజు ఈ వస్తువులు కొనకండి.. ఉప్పు, నూనె నుంచి బంగారం వరకు
అమావాస్య రోజు ఈ వస్తువులు కొనకండి.. ఉప్పు, నూనె నుంచి బంగారం వరకు
ఎల్‌నీలో ఎఫెక్ట్.. ఈ సారి చలిలేని శీతాకాలాన్ని చూడబోతున్నారు
ఎల్‌నీలో ఎఫెక్ట్.. ఈ సారి చలిలేని శీతాకాలాన్ని చూడబోతున్నారు