Chicken: వద్దే వద్దు.. చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే..

చికెన్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దానిని కొన్ని ఆహార పదార్థాలతో కలిపి లేదా తిన్న వెంటనే తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక జీవనశైలిలో చాలా మంది చికెన్‌ను తరచుగా తీసుకుంటున్నారు. అయితే, తెలియకుండానే చేసే కొన్ని ఆహార కలయికలు జీర్ణ సమస్యలకు దారితీస్తాయని పేర్కొంటున్నారు.

Chicken: వద్దే వద్దు.. చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే..
Chicken Curry

Updated on: Apr 25, 2026 | 3:50 PM

ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులు.. ఇష్టంగా మాంసం తింటారు. చికెన్, మటన్, ఫిష్ .. ఇలా చాలా రకాల వంటకాలను.. ఇష్టంగా వండుకుని తింటారు. కర్రీ, ఫ్రై, పలు రకాలుగా వండుకుని.. ఆరగిస్తారు. ఆధునిక జీవనశైలిలో చికెన్ ఆహారంలో ఒక సాధారణ భాగంగా మారింది. చాలా మంది నాన్-వెజ్ ఆహారాన్ని, ముఖ్యంగా చికెన్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చికెన్‌లో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, దానిని మితంగా మాత్రమే తీసుకోవాలి. అయితే, చికెన్ తిన్న తర్వాత లేదా దానితో కలిపి కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రధానంగా జీర్ణ సమస్యలు, కడుపు సంబంధిత ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.

చికెన్ తిన్న తర్వాత తీసుకోకూడని కొన్ని ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం..

కూల్ డ్రింక్స్ – జ్యూస్‌లు: చాలా మంది చికెన్ తిన్న తర్వాత కూల్ డ్రింక్స్ లేదా కృత్రిమ జ్యూస్‌లు తాగుతారు. అయితే, వీటిని తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. చికెన్ తిన్న తర్వాత డ్రింక్స్ తాగడం వల్ల గ్యాస్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా, శరీరంలో విషపూరిత రసాయనాలు పెరగడానికి కూడా ఇవి కారణమవుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

బంగాళదుంప చిప్స్: చికెన్ లేదా ఇతర నాన్-వెజ్ ఆహారం తిన్న తర్వాత కొందరు బంగాళదుంపలతో చేసిన చిప్స్ తింటారు. వీటిని తినడం వల్ల అజీర్ణం, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి కొన్నిసార్లు వాంతులు, విరోచనాలకు కూడా దారితీయవచ్చు.

పెరుగు – పాలు: కొందరు చికెన్ తిన్న తర్వాత పెరుగు, పాలు వంటి పదార్థాలు తీసుకుంటారు. మరికొందరు చికెన్‌తో పెరుగన్నం కూడా తింటారు. ఇలా కలిపి తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. పాలు, చికెన్ కలిసి కడుపులోకి వెళ్తే విష పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల తీవ్రమైన జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని చికెన్ తో కలిపి తినకూడదు. చికెన్ బిర్యానీతో మజ్జిగ, పెరుగు, రైతా వంటివి కూడా జీర్ణానికి ఆటంకం కలిగించి సమస్యలు సృష్టిస్తాయని పేర్కొంటున్నారు.

తేనె: చికెన్ తిన్న వెంటనే తేనెను అస్సలు తీసుకోకూడదు. తేనె త్వరగా జీర్ణం కాదు. ఈ రెండు కడుపులో కలిస్తే శరీరానికి తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తేనె ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, చికెన్‌తో కలిపి తినడం వల్ల అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది.

ఈ పదార్థాలను చికెన్ తో కలిపి కాకుండా, విడివిడిగా కొంత సమయం వ్యవధి ఉన్న తర్వాత తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఆహార కలయికలు పాటించడం ద్వారా జీర్ణ సమస్యలను నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. అయితే.. ఏదైనా అనారోగ్య సమస్యలుంటే.. నేనుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us