Butter Milk Lassi: మజ్జిగ, లస్సీలలో ఏది బెటర్.. రెండింటి ప్రయోజనాలు ఏంటి..?

|

Feb 22, 2022 | 4:06 PM

Butter Milk Lassi: మరో వారం రోజుల్లో ఎండాకాలం షురూ అవుతుంది. దీంతో పెరుగ, మజ్జిగ, లస్సీ విక్రయాలు విపరీతంగా పెరుగుతాయి. వేడి

Butter Milk Lassi: మజ్జిగ, లస్సీలలో ఏది బెటర్.. రెండింటి ప్రయోజనాలు ఏంటి..?
Butter Milk Lassi
Follow us on

Butter Milk Lassi: మరో వారం రోజుల్లో ఎండాకాలం షురూ అవుతుంది. దీంతో పెరుగ, మజ్జిగ, లస్సీ విక్రయాలు విపరీతంగా పెరుగుతాయి. వేడి నుంచి ఉపశమనం పొందడానికి జనాలు వీటిని ఎక్కువగా తీసుకుంటారు. మజ్జిగ తాగడం వల్ల పొట్టలో వేడి, మలబద్ధకం వంటి సమస్యలను కూడా అధిగమించవచ్చు. అంతే కాదు మజ్జిగ, ఉప్పు కలిపిన లస్సీ తాగడం వల్ల బరువు కూడా వేగంగా తగ్గుతారు. మజ్జిగ, లస్సీలో అనేక లక్షణాలు ఉంటాయి. వాటిలో కాల్షియం, విటమిన్ B12, జింక్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి.

వేసవిలో ప్రతిరోజూ ఆహారంతో పాటు ఒక గ్లాసు మజ్జిగను తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. మజ్జిగలో చాలా నీరు ఉంటుంది. కాబట్టి ఇది చాలా తేలికపాటి పానీయంగా చెబుతారు. ఇది చాలా త్వరగా జీర్ణమవుతుంది. ఆహారంతో పాటు మజ్జిగ తాగడం వల్ల దాహం కూడా తీరిపోయి త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. మజ్జిగలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. పెరుగు, లస్సీ కంటే మజ్జిగ కొద్దిగా పుల్లగా ఉంటుంది. కాబట్టి ఇందులో తక్కువ ఆమ్ల పదార్థాలు ఉంటాయి.

అలాగే మీకు ఆకలిగా అనిపించినప్పుడు పెద్ద గ్లాసు లస్సీ తాగితే చాలు. చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది. ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. లస్సీ కాస్త చిక్కగా ఉంటుంది. మజ్జిగ కంటే లస్సీలో ఎక్కువ కొవ్వు ఉన్నప్పటికీ ఇది తియ్యగా ఉంటుంది. ఇందులో చాలా కేలరీలు ఉంటాయి. చాలా మంది దీని తీపి రుచిని ఎక్కువగా ఇష్టపడుతారు. లస్సీ తాగడం వల్ల కడుపు చల్లబడి శరీరానికి మేలు చేస్తుంది. బరువు తగ్గడానికి మజ్జిగ తాగడం మంచి ఎంపిక. మజ్జిగలో చాలా నీరు ఉంటుంది. మజ్జిగలో లస్సీ కంటే తక్కువ కేలరీలు ఉంటాయి.

Viral Photos: లడ్డుగా ఉన్న ఈ సుందరికి బార్బీడాల్‌ అని ఫీలింగ్‌.. ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు..!

Crime News: నల్గొండ జిల్లాలో దారుణం.. 25 ఏళ్ల యువతిని గర్భవతి చేసిన 65 ఏళ్ల వృద్ధుడు..

ఆదివారం చేపలు తింటున్నారా.. మటన్ తింటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే మీ ఎంపిక మారుతుంది..?