Rainy Season Foods: వర్షకాలంలో ఇవి తింటే ఫుల్ ప్రోటీన్.. ఇన్ఫెక్షన్లకు నో ఎంట్రీ..!

వానలు పడే సీజన్‌ లో రోగనిరోధక శక్తి బలంగా ఉండటం ఎంతో ముఖ్యం. ఉదయాన్నే తీసుకునే ఆహారం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో తేలికగా జీర్ణమయ్యే, పోషకాలు ఉన్న బ్రేక్‌ఫాస్ట్ ఎంచుకోవడం ఉత్తమం. వర్షాల్లో మీ ఆరోగ్యాన్ని కాపాడేలా పనిచేసే కొన్ని ఆరోగ్యకరమైన వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Rainy Season Foods: వర్షకాలంలో ఇవి తింటే ఫుల్ ప్రోటీన్.. ఇన్ఫెక్షన్లకు నో ఎంట్రీ..!
Rainy Season Breakfast

Updated on: Jun 01, 2025 | 4:35 PM

వానాకాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారంగా అటుకుల ఉప్మా ఉత్తమ ఎంపిక. అటుకులను నీటిలో కడిగి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, పసుపు, ఆవాలు వేసి తక్కువ నూనెలో వేపితే రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం సిద్ధమవుతుంది. ఇది జీర్ణాశయానికి భారం కాకుండా శక్తిని ఇస్తుంది.

పెసరపప్పును రాత్రంతా నానబెట్టి ఉదయం మెత్తగా రుబ్బి అట్లు వేసుకోవచ్చు. ఇవి ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉండటంతో శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. కొబ్బరి లేదా పల్లీ చట్నీతో కలిపి తింటే రుచి పెరుగుతుంది. వర్షకాలంలో ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడే పోషకాలు ఇందులో ఉంటాయి.

గుంత పొంగనాల రూపంలో చేసే ఈ టిఫిన్ వర్షాకాలానికి అద్భుతం. ఇవి తక్కువ నూనెతో, తక్కువ సమయంతో తయారవుతాయి. దీనిలో కోడిగుడ్డు కలిపి వేయించినా.. కూరగాయ ముక్కలు జోడించినా మరింత పోషణ అందుతుంది. చట్నీ లేదా టమోటా పచ్చడితో తినవచ్చు.

బంగాళదుంప మసాలా వేయించి దోశలో స్టఫ్ చేయడం వల్ల మసాలా దోశ సిద్ధమవుతుంది. వర్షాకాలంలో వేడిగా వడ్డించిన మసాలా దోశకు కొబ్బరి చట్నీతో జత చేస్తే రుచి విపరీతంగా ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు సమతుల్యంగా ఉంటాయి.

ఇడ్లీ స్వల్ప నూనెతో తక్కువ మసాలాలతో తయారవుతుంది కాబట్టి వర్షాకాలానికి అనుకూలం. బీట్రూట్, క్యారెట్, మునగ ఆకులు కలిపి చేసిన ఇడ్లీ శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందిస్తాయి. పల్లీ లేదా కొబ్బరి చట్నీతో తింటే రుచికరమైన బ్రేక్‌ ఫాస్ట్ అవుతుంది.

పెసరపప్పు, సన్నగా కట్ చేసిన క్యారెట్, ఉల్లిపాయ, మెంతి ఆకులు వంటి వాటిని కలిపి తయారు చేసిన పునుగులు ప్రోటీన్‌ తో పాటు ఇతర పోషకాలను కూడా అందిస్తాయి. వేడి వేడి పునుగులతో వర్షాకాల ఉదయాన్ని ఆరోగ్యంగా ప్రారంభించవచ్చు.

బ్రెడ్ ముక్కలను టోస్ట్ చేసి ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొన్ని తేలికపాటి మసాలాలతో కలిపి వేయిస్తే చక్కటి బ్రెడ్ ఉప్మా సిద్ధమవుతుంది. ఇది తేలికగా జీర్ణమవుతుంది. ఆరోగ్యానికి హానికరం కాదు. ఫైబర్, కార్బోహైడ్రేట్లు సమంగా అందుతాయి.

సగ్గుబియ్యం వర్షాకాలంలో శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. ఇందులో బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీలు, పల్లీలు వేసి తయారు చేస్తే మేలైన కిచిడీ సిద్ధమవుతుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఉప్మా ప్రతి ఇంటిలో సాధారణంగా చేసే బ్రేక్‌ ఫాస్ట్. ఇందులో క్యారెట్, బఠానీలు, జీడిపప్పులు, బీన్స్ లాంటి కూరగాయలు కలిపితే పోషక విలువలు పెరుగుతాయి. రుచిగా ఉండడమే కాదు.. శరీరానికి అవసరమైన శక్తిని కూడా ఇస్తుంది.

వర్షాకాలంలో శరీరానికి తక్కువ మసాలాలు, తక్కువ నూనె, ఎక్కువ పోషకాలతో కూడిన బ్రేక్‌ ఫాస్ట్‌లు ఎంతో అవసరం. కనుక ఈ వానకాలంలో వీటిని మీ డైట్‌ లో చేర్చండి, ఆరోగ్యంగా ఉండండి.